Telangana DA Hike: తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు విడతల డీఏ పెంపు.. రేవంత్ సర్కార్ సంచలన ఉత్తర్వులు!
తెలంగాణలోని(Telangana DA Hike) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
Telangana government issued orders releasing two installments of Dearness Allowance for employees.
Telangana DA Hike: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం (డీఏ) పెంపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను (Telangana DA Hike) విడుదల చేసింది. సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 2024 మరియు జూలై 2024 విడతలకు సంబంధించిన డీఏలను ఒకేసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సాధారణ ఉద్యోగులకు జనవరి 2024 నుంచి డీఏ 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంపు వర్తించనుంది.
జూలై 2024 నుంచి 40.04 శాతానికి పెంపు.. అన్ని పే స్కేళ్ల ఉద్యోగులకు వర్తింపు:
ఇక జూలై 2024 విడత కింద డీఏ 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెరగనుంది. 2020 పే స్కేల్ ఉద్యోగులకు డీఏ 40.04 శాతానికి చేరగా, 2015 పే స్కేల్ వారికి 73.344% నుంచి జూలై నాటికి 81.728 శాతానికి పెరిగింది. యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE) స్కేళ్ల వారికి, 2016 స్కేల్ ఉద్యోగులకు (53% కి పెంపు), 2006 స్కేల్ ఉద్యోగులకు (246% కి పెంపు) సైతం లబ్ధి చేకూరనుంది.
నవంబర్ 1న పెరిగిన జీతాలు.. జీపీఎఫ్ ఖాతాల్లోకి బకాయిలు:
పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి నవంబర్ 1వ తేదీన నగదు రూపంలో చెల్లిస్తారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 బకాయిలను 33 వాయిదాల్లో, జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 బకాయిలను 27 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
