IND vs WI : భారత ప్లేయర్ల వీపులపై కనిపించే ఈ నల్లటి పరికరం ఏంటి? దానిని ఎందుకు ఉపయోగిస్తారంటే?
భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో వైట్ బాల్ ఫార్మాట్లలో సిరీస్‌లు (IND vs WI) ఆడుతోంది.
What are Indian players wearing on their backs during the IND vs WI series
IND vs WI : భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌తో వైట్ బాల్ ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడుతోంది. కాగా.. విండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా పలువురు భారత ఆటగాళ్లు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో వారి వీపులపై ఉబ్బెత్తు భాగం కనిపిస్తోంది.
మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఇలాగే కనిపిస్తోంది. దీంతో అది ఏంటి అనే ఆసక్తి అభిమానల్లో నెలకొంది. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తన జెర్సీని తీసివేసిన తరువాత అతడి వీపుపై ఓ నల్లటి పరికరం కనిపించింది. ఆ పరికం ఏంటి? ఆటగాళ్లకు దాని వల్ల ఏం ఉపయోగం కలుగుతుందో చూద్దాం..
దీనిని జీపీఎస్ ప్లేయర్ ట్రాకర్ అంటారు. దీనిని కంప్రెషన్ వెస్ట్ లోపల, రెండు భుజాల మధ్య ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన పాకెట్లో ఉంచుతారు. వీటిని ఎక్కువగా STATSports వంటి సంస్థలు తయారు చేస్తారు. ఈ పరికరాలు.. మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సమయంలో ఆటగాడు ఎంత దూరం పరిగెత్తాడు, వేగం, హార్ట్ బీట్, శారీరక శ్రమకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుంది.
ఈ జీపీఎస్ పరికరం వల్ల ఉపయోగం ఏంటి?
ఈ టెక్నాలజీని వాడి ప్లేయర్ల ఫిట్నెస్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. అలాగే ఆటగాళ్లకు గాయాలు కాకుండా ముందే జాగ్రత్తపడటానికి, వారి ప్రాక్టీస్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
Virat Kohli : 5 కోట్లు ఇచ్చి కోహ్లీని ఆశ్రమానికి తీసుకొచ్చారా? అసలు నిజం ఇదే..
Hey @grok, what’s this gadget that every Indian cricketer uses? 😱 https://t.co/eOHuJFKvkN
— Mukku (@Cric_Mukku) October 6, 2026
ఇటీవల కాలంలో తీరక లేని షెడ్యూల్, ఐపీఎల్ వంటి టోర్నీల కారణఃగా ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ క్రమంలో గాయాల బారిన పడుతున్నారు. ఈ పరికరం సాయంతో ఏ ఆటగాడిపై అధిక భారం పడకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటుంది.
