Samsung Galaxy S25 FE 5G : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ కిర్రాక్ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ 2026 సేల్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా కొనుగోలు చేసే స్మార్ట్ఫోన్లపై భారీ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 50వేల బడ్జెట్‌తో అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఈ డీల్ మీకోసమే.

అన్ని బ్యాంక్ ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ప్రస్తుతం దాదాపు రూ. 50వేలకు అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 59,999కు లాంచ్ కాగా ట్రిపుల్ కెమెరా, ఎక్సినోస్ చిప్, అమోల్డ్ ప్యానెల్ మరిన్నింటిని అందిస్తుంది. మీరు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ధర : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ ఫోన్ ధర భారీ తగ్గింపుతో లభిస్తుంది. దాదాపు రూ.51,385 ధరకు లిస్ట్ అయింది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులతో రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర దాదాపు రూ.50,385కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.42వేల వరకు వాల్యూ పొందవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఆసక్తిగల కస్టమర్లు నెలకు రూ. 1,807 నుంచి ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీలు ఉంటాయి. లిస్టింగ్ ధర కన్నా కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది. అదనంగా చెల్లించడం ద్వారా ఎక్స్ డెండెడ్ వారంటీ, ఇతర ప్యాకేజీలను కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ 5జీ కొనాలా? వద్దా? : భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డీల్. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్ బాగుంది. ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో వస్తుంది.

గెలాక్సీ ఏఐ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. 4,900mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్, 12MP అల్ట్రావైడ్, 8MP టెలిఫోటో లెన్స్‌లతో 3x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
