Whatsapp Feature : యూజర్లకు బిగ్ అప్‌డేట్.. వాట్సాప్ గ్యాలరీ ఓపెన్ చేయకుండానే ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు..!
Whatsapp Feature : వాట్సాప్ యూజర్లు ఫోన్ గ్యాలరీని ఓపెన్ చేయకుండానే ఫొటోలు, వీడియోలను షేర్ చేయొచ్చు. పూర్తి వివరాలు ఇవే
Whatsapp Feature
Whatsapp Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందిస్తోంది.
ఇప్పుడు, యూజర్లు ఈజీగా ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు. ఎందుకంటే షేర్ చేసేందుకు గ్యాలరీని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ అతి త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
కొత్త వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ రాబోయే ఫీచర్ గురించి కొత్త రిపోర్టులో వివరంగా తెలిపింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేసేందుకు ఇకపై గ్యాలరీని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఫీచర్ బీటా యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 2.25.37.4 వెర్షన్ వాట్సాప్‌లో కనిపించింది.
Read Also : Reliance Jio : పండగ చేస్కోండి.. 3 అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్లు.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!
కొత్త ఫీచర్ అప్‌డేట్ :
ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం.. చాట్ విండోలోని అటాచ్‌మెంట్ మెనూలో కెమెరా పక్కన గ్యాలరీ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. రీసెంట్ క్లిక్ చేసిన ఫోటోలు, వీడియోలను చూడొచ్చు.
ఈ ఫోటోలు, వీడియోలను పంపేందుకు ట్యాప్ చేయొచ్చు. గ్యాలరీని విడిగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్‌డేట్ తర్వాత ఇటీవలి గ్యాలరీని యాప్‌లోని యూజర్లకు ఫొటోలు లేదా వీడియోలు వెంటనే కనిపిస్తాయి. సింగిల్ ట్యాప్‌తో పంపవచ్చు.
లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పుడంటే? :
ప్రస్తుతం బీటాలో కొత్త ఇంటర్‌ఫేస్ టెస్టింగ్ చేస్తోంది. బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత అందరు యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి లేదా ఫిబ్రవరిలో రెగ్యులర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
