Samsung Galaxy Phones : శాంసంగ్ లవర్స్ కోసం ఖతర్నాక్ 5G ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్
Samsung Galaxy Phones : శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోన్లు రాబోతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ A37 5G, శాంసంగ్ గెలాక్సీ A57 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లలో ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy Phones
- శాంసంగ్ నుంచి గెలాక్సీ A37 5G, గెలాక్సీ A57 5G ఫోన్లు
- శాంసంగ్ గెలాక్సీ A37 5జీ స్పెసిఫికేషన్లు లీక్
- శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫీచర్లు లీక్ వివరాలు
- గెలాక్సీ A37 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
Samsung Galaxy Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి రెండు ఫోన్లు రాబోతున్నాయి. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్‌లో గెలాక్సీ A37 5G, గెలాక్సీ A57 5G ఫోన్లను లాంచ్ చేయనుంది.
కంపెనీ ఇంకా కొత్త శాంసంగ్ ఫోన్లను వెరిఫై చేయలేదు. అయినప్పటికీ లీక్‌లు పుకార్లు ఆన్లైన్లో మొదలయ్యాయి. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. ఈ శాంసంగ్ ఫోన్లు 120Hz ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తాయని భావిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ, శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ స్పెసిఫికేషన్లు లీక్ :
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో అందించవచ్చు.
అదనంగా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ ఎక్స్ ప్యాండ్ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ వన్‌యూఐ 8.5తో ఆండ్రాయిడ్ 16తో వస్తుందని భావిస్తున్నారు. డిస్ప్లే పరంగా శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని అంచనా.
ఆప్టిక్స్ విషయానికొస్తే..
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే..
ఈ హ్యాండ్‌సెట్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ స్పెసిఫికేషన్లు లీక్ :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో పాటు ఎక్సినోస్ 1680 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 12MP ఫ్రంట్ సెన్సార్‌తో వస్తుంది. బ్యాటరీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
