Credit Card Sharing : మీ క్రెడిట్ కార్డు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఇస్తున్నారా? మీరు అప్పులపాలవ్వడం ఖాయం.. చాలామంది చేసే తప్పులివే!
Credit Card : ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్లతో క్రెడిట్ కార్డును షేర్ చేస్తున్నారా? జర భద్రం.. ఆర్థికంగా నష్టపోవడానికి రెడీగా ఉండండి.. మీరు ఊహించని రిస్క్ చాలా ఉంటాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
Credit Card ( Image Credit : Google Gemini AI )
- క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ అలర్ట్
- క్రెడిట్ కార్డును ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వొద్దు
- క్రెడిట్ కార్డు వాడకంలో చాలామంది చేసే పొరపాట్లు ఇవే
- ఏ మిస్టేక్ జరిగినా ఆర్థిక భారం ప్రైమరీ కార్డుదారుడిపైనే
Credit Card : మీకు క్రెడిట్ కార్డు ఉందా? చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా? అని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఖర్చు పెట్టుకోండని ఇచ్చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. వారు చేసే ప్రతి ఖర్చుపై మీరు ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఏ చిన్న పేమెంట్ తప్పినా అది మీ క్రెడిట్ స్కోరు సహా ఇతర ఆర్థికపరమైన ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది.
సాధారణంగా చాలామంది ఒక క్రెడిట్ కార్డు తీసుకుని దానికి యాడ్ ఇన్ కార్డు ఫీచర్ ద్వారా తన కుటంబ సభ్యులకు షేరింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ఈజీగా ఉండొచ్చు. ఒకే క్రెడిట్ కార్డుతో ఫ్యామిలీ మెంబర్లు, ఫ్రెండ్స్ హాయిగా ఖర్చు పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. ఇందులో మీకు కనిపించని రిస్క్ చాలానే ఉంటాయి తెలుసా? అవేంటో తెలిస్తే ఇకపై ఎవరికి మీ క్రెడిట్ కార్డు షేరింగ్ ఇచ్చేందుకు భయపడిపోతారు.
క్రెడిట్ షేరింగ్‌తో జాగ్రత్త :
అసలు సమస్య ఇక్కడే మొదలువుతుంది. యాడ్ ఇన్ షేరింగ్ క్రెడిట్ కార్డుకు సంబంధించి చిన్న చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా ఆ నష్టాన్ని ప్రైమరీ క్రెడిట్ కార్డు హోల్డర్ మాత్రమే భరించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఇండియాలో చాలా బ్యాంకులు పూర్తిగా జాయింట్ క్రెడిట్ కార్డులను జారీ చేయవు. ప్రైమరీ కార్డుదారుడు, మరొకరు యాడ్-ఆన్ కార్డు యూజరు ఇలా ఉంటాయి. ప్రైమరీ కార్డుదారుడు ఎల్లప్పుడూ పూర్తి బాధ్యత, అన్ని ఆర్థిక నష్టాలను భరించాల్సి ఉంటుంది.
అంటే.. యాడ్-ఆన్ యూజర్ చేసిన చెల్లింపులను అధికంగా ఖర్చు చేస్తే లేదా ఆలస్యం చేస్తే ప్రైమరీ కార్డుదారుడి క్రెడిట్ స్కోరు, ఆర్థిక పరిస్థితి నేరుగా ఎఫెక్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డులను షేరింగ్ చేయడం వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
ప్రైమరీ కార్డుదారుడిపైనే ఆర్థిక భారం :
అందులో అప్పు పెరగడం, క్రెడిట్ స్కోరు దెబ్బతినడం, ఫ్యామిలీ రిలేషన్ కూడా కట్ అవుతుంది. యాడ్-ఆన్ యూజర్లు సకాలంలో పేమెంట్లు చేయకపోతే, బ్యాంక్ ప్రైమరీ కార్డుదారుడిపై మాత్రమే చర్యలు తీసుకుంటుంది. వడ్డీ, జరిమానాలను పెంచడమే కాకుండా భవిష్యత్తులో రుణాలను పొందే అవకాశం కూడా కోల్పోవాల్సి వస్తుంది.
అయితే, షేర్డ్ కార్డుకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్చులను ట్రాక్ చేయడం చాలా ఈజీ. ఫ్యామిలీపరంగా ట్రాన్స్ పరెన్సీ అందిస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ని వాడేటప్పుడు ఎవరు ఎంత ఖర్చు చేస్తారు? పేమెంట్లు ఎలా చేస్తున్నారు? కార్డు ఏ ఖర్చులకు పరిమితం చేస్తున్నారు అనేది స్పష్టమైన నియమాలను పాటించడం చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.
యాడ్ ఇన్ యూజర్లకు నో బెనిఫిట్స్ :
యాడ్-ఆన్ కార్డ్ యూజర్లు తమ సొంత క్రెడిట్ స్కోర్ పెంచుకోలేరని నివేదికలు చెబుతున్నాయి. వారు ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు చేసినా వారికి సిబిల్ స్కోరు ప్రయోజనాలు తమ వ్యక్తిగత క్రెడిట్ హిస్టరీకి యాడ్ కావు. మరోవైపు, క్రెడిట్ పేమెంట్ తప్పుగా జరిగితే మాత్రం ప్రైమరీ కార్డ్ హోల్డర్ మాత్రమే నష్టాన్ని భరిస్తాడు.
క్రెడిట్ కార్డ్‌ను షేర్ చేయడం అనేది వాడేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. కానీ, సరైన విధంగా వాడకపోతే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చివరికి ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. షేర్డ్ క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఖర్చులను మానిటర్ చేసుకోవాలి. సకాలంలో బిల్లులు చెల్లించాలి. అప్పుడే ఈ క్రెడిట్ షేరింగ్ ఫీచర్ మీ అవసరాలను తీర్చగలదు.
