Reliance Jio : పండగ చేస్కోండి.. 3 అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్లు.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!

Reliance Jio : జియో యూజర్ల హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లను అందిస్తోంది. నెలవారీ వార్షిక ప్లాన్‌లు, డేటా ప్యాక్ ఉన్నాయి. నెలవారీ వార్షిక ప్లాన్‌లు స్పెషల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి.

Reliance Jio : పండగ చేస్కోండి.. 3 అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్లు.. సింగిల్ రీఛార్జ్‌తో ఏడాదంతా ఎంజాయ్..!

Reliance Jio

Updated On : December 14, 2025 / 4:39 PM IST

Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికం దిగ్గజం తమ కస్టమర్ల కోసం హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

నివేదికల ప్రకారం.. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల ధర రూ. 103 (ఫ్లెక్సీ ప్యాక్ డేటా యాడ్-ఆన్), రూ. 500 (సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్) రూ. 3599 (హీరో రీఛార్జ్ వార్షిక ప్లాన్) ఉన్నాయి.

కంపెనీ వార్షిక నెలవారీ ప్లాన్‌లు 365 రోజుల వరకు వ్యాలిడిటీతో వస్తాయి. ఈ ప్లాన్‌లలో మీరు రోజుకు 2.5GB వరకు డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లు అర్హత కలిగిన వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తాయి.

ఈ ప్లాన్లలో రూ. 35,100 ధర గల గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు యాక్సెస్ కూడా అందిస్తుంది. వ్యాలిడిటీ 18 నెలలు ఉంటుంది. కంపెనీ డేటా ప్యాక్‌లు వినియోగదారులకు మొత్తం 5GB డేటాను వివిధ OTT యాప్‌లకు యాక్సెస్‌ అందిస్తాయి. ఈ ప్లాన్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ.3599 ప్లాన్ :
ఈ జియో హీరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది. అర్హత ఉన్న యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తుంది.

Read Also : Best Phones 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? 12GB ర్యామ్‌తో 3 అతి చౌకైన ఫోన్లు.. రూ. 7వేల లోపే.. డోంట్ మిస్..!

కంపెనీ రోజుకు 100 ఫ్రీ SMS మెసేజెస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది. ఈ జియో ప్లాన్ల ధర రూ. 35,100కు పొందవచ్చు.

రూ. 500 రీఛార్జ్ ప్లాన్ :

జియో సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

అర్హత ఉన్న యూజర్లు ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా పొందవచ్చు. కంపెనీ రోజుకు 100 ఉచిత SMS మెసేజ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్ 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రోకి ఫ్రీ యాక్సెస్‌ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్, సోనీ లైవ్ జీ5 వంటి యాప్‌లకు యాక్సెస్‌ కూడా అందిస్తుంది.

రూ. 103 ఫ్లెక్సీ ప్యాక్ :
జియో ఈ కొత్త ఫ్లెక్సీ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. కంపెనీ ఇంటర్నెట్ కోసం మొత్తం 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫుల్ ఎంటర్మైన్మెంట్ అందిస్తుంది.

ఇందులో హిందీ ప్యాక్, ఇంటర్నేషనల్ ప్యాక్ రీజినల్ ప్యాక్ ఉన్నాయి. హిందీ ప్యాక్‌లో, కంపెనీ యూజర్లకు జియో హాట్‌స్టార్, జీ5 సోనీ లివ్‌లకు యాక్సెస్‌ను ఇస్తోంది.

ఇంటర్నేషనల్ ప్యాక్‌లో, జియో హాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, లయన్స్‌గేట్ డిస్కవరీ+ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ప్రాంతీయ ప్యాక్ విషయానికి వస్తే.. ఇందులో జియో హాట్‌స్టార్‌తో పాటు, సన్‌ఎన్‌ఎక్స్‌టీకి యాక్సెస్ పొందవచ్చు.