Best Phones 2025 : కొత్త ఫోన్ కొంటున్నారా? 12GB ర్యామ్‌తో 3 అతి చౌకైన ఫోన్లు.. రూ. 7వేల లోపే.. డోంట్ మిస్..!
Best Phones 2025 : అతి చవకైన ధరలో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. 12GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో రూ. 7వేల లోపు ధరలో కొనేసుకోవచ్చు..
Best Phones 2025
Best Phones 2025 : మీ బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఫోన్ కలిగిన అద్భుతమైన 3 ఫోన్లు లభ్యమవుతున్నాయి.
ఈ ఫోన్లలో రూ. 7వేల కన్నా తక్కువ ధరలో (Best Phones 2025) కొత్త ఫోన్ కొనేసుకోవచ్చు. 12GB వరకు ర్యామ్ అందిస్తాయి. ధరకు తగ్గట్టుగా అత్యుత్తమ డిస్‌ప్లేలు ఆకట్టుకునే కెమెరా సెటప్‌లు కూడా ఉన్నాయి.
ఈ జాబితాలో Itel, Infinix, Lava నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఫోన్‌లు ఎలాంటి ఆఫర్‌లు లేకుండా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లావా O3 :
4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన లావా ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.5949 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్‌లో 4GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. అవసరమైతే మొత్తం ర్యామ్ 8GBకి పెంచుకోవచ్చు. 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంది.
ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 13MP ఏఐ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల కోసం కంపెనీ 5MPఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ లావా ఫోన్‌లో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది.
ఐటెల్ జెనో 20 :
ఈ ఐటెల్ ఫోన్ 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఎక్స్ పాండబుల్ ర్యామ్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఫోన్ మొత్తం ర్యామ్, 12GB స్టోరేజీకి పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఐటెల్ ఫోన్ కెమెరా 13MP, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మీరు ఫోన్‌లో 5000mAh బ్యాటరీని పొందవచ్చు. ఈ బ్యాటరీ 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అమెజాన్ ఇండియాలో ధర రూ. 6639కు కొనుగోలు చేయొచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ :
3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 6699 ధరకు లభిస్తోంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌లో కంపెనీ 3GB వరకు వర్చువల్ ర్యామ్ అందిస్తోంది. మొత్తం ర్యామ్ 6GBకి పెంచుకోవచ్చు.
ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G50 చిప్‌సెట్ అందిస్తోంది. ఈ ఫోన్‌లో డైనమిక్ బార్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ ఫోన్‌కు 5000mAh బ్యాటరీకి సపోర్టు అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 13MP మెయిన్ కెమెరా కలిగి ఉంది.
