POCO C85 5G Launch : పోకో C85 5G ఫోన్ అదుర్స్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫీచర్లు కేక.. ధర రూ. 10,999కే..!

POCO C85 5G Launch : పోకో C85 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. అతి చౌకైన ధరకే పోకో C85 5జీ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

POCO C85 5G Launch : పోకో C85 5G ఫోన్ అదుర్స్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫీచర్లు కేక.. ధర రూ. 10,999కే..!

POCO C85 5G Launch

Updated On : December 14, 2025 / 3:18 PM IST

POCO C85 5G Launch : కొత్త పోకో ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. పోకో C85 5జీ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 6000mAh బ్యాటరీ ఫోన్ రూ. 10,999కి కొనేసుకోవచ్చు. 4 ఏళ్ల అప్‌డేట్స్ కూడా పొందవచ్చు.

ఈ కొత్త పోకో C85 5G ఫస్ట్ సేల్ వచ్చే వారం (POCO C85 5G Launch) ప్రారంభం కానుంది. లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో ఈ పోకో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మరో రెండు రోజులు ఆగండి.. కొత్త పోకో C85 5G ఫస్ట్ సేల్ వచ్చే వారం డిసెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ కొత్త పోకో 5జీ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధర ఉన్నప్పటికీ ఈ పోకో ఫోన్ 6,000mAh బ్యాటరీతో పాటు పవర్‍ఫుల్ 50MP కెమెరా కలిగి ఉంది. రాబోయే ఫస్ట్ సేల్‌లో ఫోన్ ఎంత చౌకగా లభ్యమవుతుంది. స్పెషల్ ఫీచర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చౌకైన ధరకే :
భారత మార్కెట్లో పోకో C85 5G ఫోన్ ధర 4GB+128GB వేరియంట్ ధర రూ. 12,499, 6GB+128GB వేరియంట్ ధర రూ. 13,499, 8GB+128GB వేరియంట్ ధర రూ. 14,499కు పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు వరుసగా రూ. 10,999, రూ. 11,999, రూ.13,499 తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Read Also : Samsung Galaxy S24 FE : వారెవ్వా.. బిగ్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI క్రెడిట్ డెబిట్ కార్డులతో రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. డిసెంబర్ 16న ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ పోకో ఫోన్ మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్ పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ సపోర్టు :

పోకో కొత్త ఫోన్ 6.9-అంగుళాల HD+ (720×1600 పిక్సెల్స్) డిస్‌ప్లే, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ TÜV రైన్‌ల్యాండ్ లో-బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ సిర్కాడియన్ ఫ్రెండ్లీ సర్టిఫికేషన్‌ కలిగి ఉంది.

ఈ ఫోన్ HyperOS 2.2 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపొందించింది. ఈ కొత్త ఫోన్ 2 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ పొందవచ్చు.

భారీ ర్యామ్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఈ ఫోన్ ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoC,మాలి-G57 MC2 జీపీయూ పవర్ పొందుతుంది. 8GB LPDDR4x ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా, బ్యాటరీ ఫీచర్లు :
ఆప్టిక్స్ పరంగా పోకో C85 5జీ ఫోన్ 50MP (f/1.8) ప్రైమరీ లెన్స్ QVGA కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8MP(f/2.0) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.

33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ 10W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. పోకో ఫోన్ 28 నిమిషాల్లో ఒక శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ 106 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

ఇతర స్పెషల్ ఫీచర్లు :
ఈ ఫోన్ 211 గ్రాముల బరువు ఉంది. IP64 రేటింగ్‌‌తో వస్తుంది. ఈ పోకో ఫోన్‌లోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్ యాక్సిలెరోమీటర్ ఉన్నాయి.

సేఫ్టీ కోసం ఈ పోకో ఫోన్ లో-సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G,4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ , GPS ఉన్నాయి.