Samsung Galaxy S24 FE : వారెవ్వా.. బిగ్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ రూ. 30వేల ధర తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24FE అతి తక్కువ ధరకే లభిస్తోంది. మీరు రూ.30వేల లోపు ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే..
యూజర్ ఇంటర్‌ఫేస్, ట్రిపుల్ కెమెరా ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. లాస్ట్ జనరేషన్ ఫ్యాన్ ఎడిషన్, శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్లు తర్వాత ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.30వేల కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. ధర రూ.30వేల కన్నా తక్కువకు తగ్గుతుంది. ఈ ఫోన్ రూ.59,999కి లాంచ్ అయింది. భారీ బ్యాటరీ, ఎక్సినోస్ చిప్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర ఎంతంటే? :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర రూ. 33,999 వద్ద ఉంది. భారీ ధర తగ్గింపుతో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు.
తద్వారా ధర రూ. 30వేల కన్నా తక్కువగా పొందవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ నుంచి నెలకు రూ. 2,834 నుంచి ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఏదైనా పాత ఫోన్ ఉంటే.. ఎక్స్ఛేంజ్ కోసం కొత్త శాంసంగ్ గెలాక్సీ S24FE ఫోన్ కొనుగోలుపై రూ. 31,350 వరకు వాల్యూను పొందవచ్చు. అదనంగా పేమెంట్ చేయడం ద్వారా యాడ్-ఆన్స్ కూడా పొందవచ్చు. ఇందులో ఎక్స్‌టెండెడ్ వారంటీ, మొబైల్ ప్రొటెక్షన్ కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G స్పెసిఫికేషన్లు :
ఆకర్షణీయమైన డిస్‌ప్లే , 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ పొందవచ్చు. శాంసంగ్ ఎక్సినోస్ 2400e SoCతో వస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది.
4,700mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్ 8MP టెలిఫోటో సెన్సార్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఈ శాంసంగ్ ఫోన్ 10MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
