Google Pixel 10 : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. గూగుల్ పిక్సెల్ 10పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Google Pixel 10 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. గూగుల్ పిక్సెల్ 10పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Google Pixel 10

Updated On : December 14, 2025 / 10:57 AM IST

Google Pixel 10 : కొత్త గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇటీవలే భారత మార్కెట్లో రూ. 79,999కి లాంచ్ అయినా పిక్సెల్ 10 ఫోన్ అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది.

గూగుల్ క్లీన్ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్లు (Google Pixel 10) కోరుకునే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ కాలం రోజులు ఉండవు. ఈ ప్రీమియం ఫోన్‌ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో రూ.79,999 ధరకు లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 ఇప్పుడు అమెజాన్‌లో రూ.10,549 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దాంతో ధర రూ.69,450కి తగ్గింది.

ఈఎంఐ లావాదేవీలకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా రూ.3,500 తగ్గింపు కూడా పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్స్ కోసం కస్టమర్‌లు పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Read Also : New Car Buying Guide : ఈ డిసెంబర్‌లో కొత్త కారు కొనాలా? వద్దా? ఒకవేళ కొంటే కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? ఫుల్ డిటెయిల్స్..!

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అదనపు మన్నిక కోసం స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్, 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, పిక్సెల్ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌,  4,970mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

కెమెరా సెక్షన్‌లో గూగుల్ పిక్సెల్ 10లో మాక్రో ఫోకస్‌తో కూడిన 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్‌ అందించే 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం పిక్సెల్ ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.