New Car Buying Guide : ఈ డిసెంబర్‌లో కొత్త కారు కొనాలా? వద్దా? ఒకవేళ కొంటే కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? ఫుల్ డిటెయిల్స్..!
New Car Buying Guide : డిసెంబర్‌లో కారు కొనే ముందు జాగ్రత్త.. కొత్త కారు కొనేముందు సరైన నిర్ణయం తీసుకోండి. లాభాలు, నష్టాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.
New Car Buying Guide
New Car Buying Guide : డిసెంబర్ నెల.. అందులోనూ ఇయర్ ఎండ్ సేల్స్ కదా.. కొత్త కారు కొందామని అనుకుంటున్నారా? కాస్త ఆగండి.. సాధారణంగా డిసెంబర్ నెలలో సేల్స్ సందడి కనిపిస్తుంది. ఆటో డీలర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ఊరిస్తుంటారు. అందుకే చాలామంది కారు కొనే ముందు వచ్చే ఏడాది ఈ కారు మోడల్‌ను కోల్పోతామేమో ముందుగా కొనేస్తుంటారు.
డిసెంబర్‌లో కారు కొనడం వల్ల (New Car Buying Guide) లాభాలు ఉన్నాయి.. అలాగే నష్టాలు ఉన్నాయి. మీరు డిసెంబర్‌లో కొత్త కారు కొనే ముందు ఈ రెండింటిని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. డిసెంబర్‌లో కారు కొనాలా? వద్దా అనేది ముందుగా లాభానష్టాలను అంచనా వేసుకున్నాకే డిసైడ్ చేసుకోండి. మార్కెట్ పరంగా పరిశీలిస్తే.. డిసెంబర్ నెలలో కారు కొంటే కలిగే ప్రయోజనాలేంటి? నష్టపోయేది ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
డిసెంబర్‌లో కారు కొంటే కలిగే బెనిఫిట్స్ ఇవే :
1. బంపర్ డిస్కౌంట్లు, ఆఫర్లు :
డిసెంబర్‌లో కారు కొనడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. అనే కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డీలర్లు, కంపెనీలు స్టాక్ క్లియర్ చేసేందుకు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. తద్వారా కార్లు అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. అందుకే చాలా మంది డిసెంబర్‌లో కార్లను కొనాలని చూస్తుంటారు.
కొత్త మోడళ్ల (2026 మోడల్‌లు) కోసం కంపెనీలు తమ పాత మోడల్ సంవత్సరాల స్టాక్‌ను (2025 మోడల్స్) క్లియర్ చేస్తుంటాయి. అందుకే పాత మోడల్ ఇయర్ కార్లపై డిస్కౌంట్లను అందిస్తారు. ఈ ఆఫర్‌లలో క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. కొన్ని కార్లు రూ. 1 లక్ష కన్నా ఎక్కువ డిస్కౌంట్‌లను అందిస్తాయి. డీలర్లు పాత స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఆఫర్లు గుప్పిస్తుంటారు.
2. ఫైనాన్సింగ్ ఇన్‌స్టంట్ డెలివరీ :
ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఆటోమొబైల్ కంపెనీలు తరచుగా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ అందిస్తాయి. ఆ సమయంలో మరిన్ని కార్ల కొనుగోళ్లను ప్రోత్సహిస్తాయి. నెలవారీ ఈఎంఐలను తగ్గిస్తుంది. డబ్బు ఆదా చేస్తుంది. కంపెనీలు సాధారణంగా డిసెంబర్‌లో తగినంత వెహికల్ స్టాక్ ఉంటాయి. ఈ స్టాక్‌ను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్లను అందిస్తారు. అందుకే, డిసెంబర్‌లో కారు కొనుగోళ్లు ఇన్‌స్టంట్ డెలివరీని అందిస్తాయి. ఇందుకోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
డిసెంబర్‌లో కారు కొనడం వల్ల కలిగే నష్టాలివే :
1. సెకండ్ హ్యాండ్ కార్లు :
డిసెంబర్‌లో కారు కొంటే పాత కారు వస్తుంది. డిసెంబర్‌లో అమ్మిన కార్లు సాధారణంగా 5 నెలల నుంచి 6 నెలల పాతవే ఉంటాయి. ఇంకా, కొనుగోలు చేసిన నెల తర్వాత ఆ కారు మరుసటి ఏడాది జనవరిలో ఒక ఏడాది పాతది అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఒక ఏడాది పాతది అవుతుంది.
2. రీసేల్ వాల్యూ తగ్గుతుంది :
ఈ నెలలో కారు కొనడం వల్ల కలిగే నష్టాల్లో ఇదొకటి. డిసెంబర్ 2025లో మీ కారు రిజిస్టర్ అయినప్పటికీ భవిష్యత్తులో మీరు ఈ కారును అమ్మితే 2025 మోడల్ ఇయర్ కారుగానే రిజిస్టర్ అయి ఉంటుంది. కారు రీసేల్ వాల్యూ తగ్గుతుంది. అంటే సెకండ్ హ్యాండ్ కారుగా ధర తగ్గుతుంది. మీరు దానిని విక్రయించినప్పుడు, మీకు తక్కువ ధర లభిస్తుంది. ఇంకా, ప్రజలు ఉపయోగించిన కార్లను కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది.
