Best 5G Smartphones : 7000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో రూ. 15వేల లోపు 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!

Best 5G Smartphones : తక్కువ ధరలో కిర్రాక్ ఫీచర్లు కలిగిన ఫోన్ల కోసం చూస్తున్నారా? రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఏదో ఒకటి కొనేసుకోండి.. పూర్తి వివరాలివే..

1/6Best 5G Smartphones
Best 5G Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారీ బ్యాటరీలు, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో ఐక్యూ 15, వన్‌ప్లస్ 15 వంటి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లను ప్రవేశపెట్టాయి. ఒప్పో, వివో కూడా ఇటీవలే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను లాంచ్ చేశాయి. ఫ్లాగ్‌షిప్‌లు మాత్రమే కాకుండా బడ్జెట్ కేటగిరీలో కూడా అనేక ఫోన్లు ఉన్నాయి. రియల్‌మి, రెడ్‌మీ వంటి బ్రాండ్‌లతో సహా రూ. 15వేల కన్నా తక్కువ ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు కావాల్సిన ఫోన్ సొంతం చేసుకోండి.
2/6realme p4x 5g
రియల్‌మి P4x : రియల్‌మి P4x ఫోన్ ఏరోస్పేస్ డిజైన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో ఆధారితమైన 4K వీడియోకు సపోర్టు ఇస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. రియల్‌మి P4x బేస్ 6GB/128GB వేరియంట్ ధర రూ. 15,999కు పొందవచ్చు. కానీ, బ్యాంక్ ఆఫర్‌లతో మీరు కేవలం రూ. 14,499కి కొనుగోలు చేయవచ్చు.
3/6Moto G57 Power
మోటో G57 పవర్ : మోటో G57 పవర్ అనేది బడ్జెట్ 5G ఫోన్. భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా కూడా పవర్ పొందుతుంది. ఈ మోటో ఫోన్ 6.72-అంగుళాల 120Hz FHD+ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. భారత మార్కెట్లో 8GB/128GB మోడల్ ధర రూ. 13,999కు పొందవచ్చు. కానీ, ఆఫర్‌తో కేవలం రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.
4/6Redmi 15C 5G
రెడ్‌మి 15C 5G : ఈ రెడ్‌మి 5G ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఫోన్ టాప్ బ్రైట్‌నెస్ 810 నిట్స్ వరకు ఉంటుంది. పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బ్యాక్ కెమెరా 50MP, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. రెడ్‌మి 15C 5G ఫోన్ బేస్ 4GB/128GB వేరియంట్ ధర రూ. 12,499 నుంచి ప్రారంభమవుతుంది.
5/6poco c85 5g
పోకో C85 5G : పోకో C85 5జీ ఫోన్ రెడ్‌మి 15C 5జీతో అద్భుతమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. కానీ, మరో డిజైన్‌ కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ డ్యూయల్-టోన్ మ్యాట్ ఫినిషింగ్‌ కలిగి ఉంది. ధరకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఈ ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ద్వారా కూడా పవర్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. పోకో C85 5G ఫోన్ 4GB/128GB వేరియంట్ ధర రూ. 11,999కు పొందవచ్చు.
6/6lava play max
లావా ప్లే మ్యాక్స్ : ఈ లిస్టులో చివరి ఫోన్ లావా నుంచి వచ్చింది. బడ్జెట్ యూజర్లకు ఇది గేమింగ్ ఫోన్‌. ఈ ఫోన్ గేమింగ్ ఫ్యూచర్ డిజైన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ లావా ఫోన్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. లావా ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. బేస్ మోడల్ 6GB/128GB వేరియంట్ రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది.