OnePlus 13 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ వన్‌ప్లస్ 13 5Gపై ఏకంగా రూ. 10,500 తగ్గింపు, ట్రిపుల్ 50MP కెమెరాలు హైలెట్!
OnePlus 13 5G : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ రూ. 10,500 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ తగ్గింపు ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 13 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ టైమ్. మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన డీల్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 అదిరిపోయే డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది.

ప్రస్తుతం రూ. 13,400 తక్కువకు అందుబాటులో ఉంది. ఈ రకమైన డీల్స్ సాధారణంగా లిమిటెట్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ డిస్కౌంట్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

భారత్‌లో వన్‌ప్లస్ 13 ధర : ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ రూ. 69,999కి లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ధర రూ. 59,499కి అమ్ముడవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 10,500 తక్కువకు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే పేమెంట్లపై అదనంగా రూ. 2,975 తగ్గింపు కూడా పొందవచ్చు.

అదనపు డిస్కౌంట్ కోసం చూస్తుంటే.. మీ పాత ఫోన్‌ను అదనపు డిస్కౌంట్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర పరంగా ఐక్యూ, ఆపిల్, వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి ఇతర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లకు బలమైన గట్టి పోటీని ఇస్తుంది.

వన్‌ప్లస్ 13 5జీ స్పెసిఫికేషన్లు : ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 830 జీపీయూతో రన్ అవుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో కూడా వస్తుంది.

ఈ ఫోన్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్ప్లే ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. మీరు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
