Chandra Gochar 2026 : తులా రాశిలో చంద్రుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక సమస్యలు,అనుకోని ఖర్చులు.. శివుడికి ఇవి సమర్పిస్తే..
Chandra Gochar 2026 : ఏప్రిల్ 3, శుక్రవారం నాడు చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యలు తప్పవంటున్నారు.
Chandra Gochar 2026 Moon moves into Libra these zodiac signs may face financial and career concerns
Chandra Gochar 2026 : ఏప్రిల్ 3, శుక్రవారం చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. సాధారణంగా చంద్రుడి సంచారం తక్కువ కాలం మాత్రమే ఉండి.. కొద్దిపాటి మార్పులను కలిగిస్తుంది. ఇవి రోజువారీ జీవితంలో పెద్దగా ప్రభావం చూపవు కానీ చిన్న చిన్న అసమతుల్యతలను కలిగిస్తాయి. దీంతో కొన్ని రాశుల వారికి పని, ఆర్థిక పరిస్థితులు లేదా సాధారణ స్థిరత్వం విషయంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్ద సమస్యలు రాకపోయినా.. కొంత జాగ్రత్త అవసరం. అలాగే కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే.. మానసిక ప్రశాంతత, స్థిరత్వం పొందవచ్చు.
తులా రాశిలో చంద్రగమనం వల్ల కొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఆర్థిక ఒత్తిడి, ఆఫీసు సమస్యలు, అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవంటే..
వృషభం:
తులా రాశిలో చంద్రుడి సంచారం వల్ల ప్రభావితమయ్యే రాశుల్లో వృషభ రాశి ఉంది. చంద్ర సంచారం వీరికి అనుకూలంగా ఉండదు. ప్రత్యర్థులు, పోటీదారుల వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. ఆఫీసుల్లో రాజకీయాలు పెరిగే అవకాశం ఉంది.. కాబట్టి వృషభ రాశి వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు.
పరిహారం:
ఈ సమయంలో శివుడికి పూజలు చేయడం మనశ్శాంతిని ఇస్తుంది.
వృశ్చికం (Scorpio):
చంద్ర సంచారం వల్ల వృశ్చిక రాశి వారు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కనుక.. డబ్బు ఖర్చు చేసే విషయంలో అప్రమత్తత అవసరం. మీ పరిస్థితిని వాడుకునే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఉద్యోగం చేసేవారు.. పై అధికారులు మిమ్మల్ని గమనించే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం:
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది.
మీన రాశి (Pisces):
తులా రాశిలో చంద్రుడి సంచారం వల్ల మీన రాశి వారికి అనుకోని పరిస్థితులు తలెత్తడం.. అవసరం లేని ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంది.. కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే వారు.. మీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం:
మీన రాశి వారు.. శివలింగానికి నీళ్లు సమర్పించడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి.
