TN 2026 Ott: విజయ్ టార్గెట్గా వచ్చిన ‘టీఎన్ 2026’ మూవీ.. ఏకంగా ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేస్తున్న టీఎన్ 2026(TN 2026 Ott) మూవీ.
TN 2026 movie streaming on five OTT platforms
- ఓటీటీలోకి ‘టీఎన్ 2026’ మూవీ
- ఏకంగా ఐదు ఓటీటీలలో స్ట్రీమింగ్
- రాజకీయ నేపథ్యంతో సాగే కథ
TN 2026 Ott: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన సినిమా ‘టీఎన్ 2026’. తమిళ స్టార్ దళపతి విజయ్ ‘తమిళ వెట్రి కళగం’ పార్టీతో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన తరుణంలో, ఈ సినిమా విడుదల కావడం కోలీవుడ్లో పెను సంచలనం సృష్టించింది. ఒక స్టార్ హీరో తన అభిమాన సంఘాలను రాజకీయ శక్తిగా మార్చి, ముఖ్యమంత్రి కావాలని చేసే ప్రయత్నాల చుట్టూ ఈ చిత్ర కథాంశం సాగుతుంది. ఇది విజయ్ను ఉద్దేశించి తీసిన సినిమా అని ప్రచారం జరిగినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఇది కేవలం కల్పిత కథ అని స్పష్టం చేసింది.
Trisha: అప్పుడే నాకు అసలైన ప్రశాంతత.. ఇన్స్టాలో త్రిష షాకింగ్ పోస్ట్
ఈ సినిమాకు ప్రముఖ నటుడు తంబి రామయ్య కథ అందించగా, ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. నటుడు నటరాజన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడికానున్న తరుణంలో, ఎన్నికల వేడి ఇంకా తగ్గకముందే ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి తీసుకురావడం విశేషం.
‘టీఎన్ 2026(TN 2026 Ott)’ సినిమా ఏప్రిల్ 30 నుండి ఏకంగా ఐదు ప్రముఖ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ వేదికలపై తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ పొలిటికల్ డ్రామా, ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది.
