Bhogi: ‘భోగి’ నుండి అనుపమ ఫస్ట్ లుక్ విడుదల.. ‘కందుల సులోచన రాణి’గా సర్ప్రైజ్
భోగి(Bhogi) సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.
Anupama Parameswaran First Look Released from Sharwanand Bhogi Movie
- భోగి నుండి అనుపమ ఫస్ట్ లుక్
- కందుల సులోచన రాణిగా డీగ్లామర్ లుక్
- పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదల
Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘భోగి’. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుండి తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఈ చిత్రంలో ఆమె ‘కందుల సులోచన రాణి’ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది. సాధారణంగా గ్లామరస్ పాత్రల్లో కనిపించే అనుపమ, ఈ సినిమాలో ఇస్తార్లు (విస్తరాకులు) కుట్టుకుంటూ జీవనం సాగించే ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటం విశేషం.
TN 2026 Ott: విజయ్ టార్గెట్‌గా వచ్చిన ‘టీఎన్ 2026’ మూవీ.. ఏకంగా ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్
1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ కథలో అనుపమ పాత్ర చాలా సహజంగా, గంభీరంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఆమె ఆహార్యం, కట్టుబొట్టు ఆ కాలం నాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పాత్ర కోసం అనుపమ తన మేకప్, బాడీ లాంగ్వేజ్‌లో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యం ఉండటంతో, ఈ పాత్ర ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇప్పుడు అనుపమ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మరో కథానాయికగా డింపుల్ హయతి నటిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘భోగి(Bhogi)’ చిత్రం ఆగస్టు 28, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
- Anupama Parameswaran First Look Released from Sharwanand Bhogi Movie

