AP SSC Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.. ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
AP SSC Results 2026 : ఏపీలో పదోవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
AP SSC Results 2026
AP SSC Results 2026 : ఏపీలో పదోవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.
♦ ఏపీలో మొత్తం 12,089 పాఠశాలలు
♦ పబ్లిక్ పరీక్షలకు 6,18,131 మంది విద్యార్హులు హాజరు.
♦ 85.25శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
♦ బాలురు (2,59,633 మంది విద్యార్థులు) 82.68శాతం.
♦ బాలికలు (2,67,321 మంది విద్యార్థినులు) 87.90శాతం
♦ బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.
♦ మొత్తం 2,161 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి.
♦ 16పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.
♦ పార్వతీపురం మన్యం జిల్లా 96.07శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచింది.
♦ అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే.?
రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫీజును మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చెల్లించవచ్చునని తెలిపింది. రూ.50 లేట్ ఫీజుతో మే25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీ కౌంటింగ్ (సబ్జెక్టు కు రూ.500), రీ వెరిఫికేషన్ (సబ్జెక్టుకు రూ.వెయ్యి) కోసం వెచ్చించాల్సి ఉంటుంది.
ఫలితాలు:https://apopenschool.ap.gov.in ద్వారా లేదా 10tv.in ద్వారా లేదా మన మిత్ర వాట్సాప్ నెం. 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు.
మీ మొబైల్లో 95523 00009 నంబర్ సేవ్ చేయండి. వాట్సాప్లో “Hi” అని మెసేజ్ పంపండి. ఆ తరువాత ‘Education Services’ ఎంపికను ఎంచుకోండి. ‘Download SSC Results’ పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి. ఆ వెంటనే మీ మార్కుల మెమో డిస్ప్లే అవుతుంది.
🚨 SSC Public Examinations, March 2026 Results are now live 🚨
Students can access their results through:
• Official Portal: https://t.co/jyZPaxr5Q9
• Mana Mitra (WhatsApp Governance): Send “Hi” to 9552300009
• LEAP Mobile Application
• DigiLocker
Results are also available…— Lokesh Nara (@naralokesh) April 30, 2026


