Today Horoscope in Telugu : రాశి ఫలాలు 28 ఏప్రిల్.. ఈ రాశి వారికి నేడు అస్సలు బాగాలేదు.. జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే..!
Daily horoscope in Telugu Date 28 April : ఏప్రిల్ 28, మంగళవారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..
Horoscope Today 28 April 2026 tuesday Rasi Phalalu Telugu
Today Horoscope in Telugu : ఏప్రిల్ 28, మంగళవారం నాడు పరశురామ ద్వాదశి. ఈ రోజున విష్ణు ఆరాధన చేయడం అత్యంత శుభప్రదమని భక్తుల నమ్మకం. మరి ఈ రోజున పంచాంగ విశేషాలు మరియు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ముఖ్యమైన సమయాలు:
- వర్జ్యం: తెల్లవారుజామున 06:35 వరకు.
- దుర్ముహూర్తం: ఉదయం 08:02 – 09:03 వరకు మరియు రాత్రి 10:52 – 11:37 వరకు.
- అమృత గడియలు: మధ్యాహ్నం 03:01 – 04:42 వరకు.
- రాహుకాలం: మధ్యాహ్నం 03:11 – 04:46 వరకు.
- యమగండం: ఉదయం 08:50 – 10:25 వరకు.
ద్వాదశ రాశి ఫలాలు
మేష రాశి:
హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో త్వరితగతిన లాభాలు పొందుతారు. గతంలో జరిగిన మోసాల నుండి గుణపాఠం నేర్చుకుని అభివృద్ధి చెందుతారు. ఆరోగ్య సమస్యలు తొలగుతాయి.
వృషభ రాశి:
నేడు బద్ధకం, పని వాయిదా వేసే తత్వం వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలహాలు ఏర్పడే సూచన ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం శ్రేయస్కరం.
మిథున రాశి:
ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. వృత్తిలో షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఆటంకాలు ఎదురైనా దైవదర్శనం వల్ల ఉపశమనం లభిస్తుంది.
కర్కాటక రాశి:
గృహంలో శుభకార్యాలకు అనుకూల సమయం. పాత బాకీలు వసూలవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనయోగం పుష్కలంగా ఉంది.
సింహ రాశి:
భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. చేసే పనుల్లో ఆటంకాలు, మానసిక ఆందోళన ఉంటాయి. రావలసిన బాకీలు వసూలు కాక ఇబ్బంది పడతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
కన్య రాశి:
ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
తులా రాశి:
ప్రయాణాల్లో అజాగ్రత్త వల్ల ఇబ్బందులు రావచ్చు. ఆయుధాల వల్ల లేదా వాహనాల వల్ల స్వల్ప గాయాలయ్యే సూచన ఉంది. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుతాయి. శారీరక నొప్పులు బాధించవచ్చు.
వృశ్చిక రాశి:
స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. అపనిందలు వచ్చే అవకాశం ఉన్నా, చివరికి విజయం మీదే. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి పదింతల లాభం వచ్చే అవకాశం ఉంది. సంతానం వల్ల సుఖం పొందుతారు.
ధనుస్సు రాశి:
రాజకీయ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కమాండింగ్ పొజిషన్లో ఉంటారు.
మకర రాశి:
తెలియని భయం, ఆందోళన వెంటాడుతాయి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయానికి సమానంగా ఖర్చులు ఉంటాయి. తండ్రిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభ రాశి:
అకారణ విరోధాలు ఏర్పడతాయి. ఉదర సంబంధిత (కడుపు) సమస్యలు రావచ్చు. భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సహచరుల వల్ల వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీన రాశి:
వ్యాపారాల్లో లాభదాయక స్థితి ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. నూతన వస్తు, వాహన ప్రాప్తి ఉంది. శత్రువులు దూరమవుతారు. అందరి మన్ననలు పొందుతారు.
