Gold And Silver Rates : గోల్డ్ కొనేవారికి బిగ్ న్యూస్.. బంగారం ధరలో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold And Silver Rates : బంగారం, వెండి కొనేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ న్యూస్. ఇవాళ బంగారం ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
Gold And Silver Rates
- బంగారం ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఇవాళ పెరిగింది.
- సోమ, మంగళ, బుధవారాల్లో గోల్డ్ రేటు తగ్గింది. ఈ మూడు రోజుల్లో 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై సుమారు రూ.3,500 తగ్గింది. అయితే, ఇవాళ (గురువారం) మాత్రం గోల్డ్ రేటు పెరిగింది.
- గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.220 పెరగ్గా, 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై మూడు డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,546 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,50,660 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,100 వద్ద కొనసాగుతోంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,50,810కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,50,660కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,38,100 వద్ద కొనసాగుతుంది.
- వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000వద్దకు చేరింది.
- గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
