Virat Kohli : గుజరాత్‌తో మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు..
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
IPL 2026 GT vs RCB Virat Kohli inches away from major Chris Gayle world record (pic credit@ipl)
- గుజరాత్ మ్యాచ్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీని ఊరిస్తున్న రికార్డు
- టీ20 క్రికెట్లో 14వేల పరుగుల మైలురాయి
- 106 పరుగుల దూరంలో విరాట్
Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (గురువారం ఏప్రిల్ 30న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో గనుక కోహ్లీ 106 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 14 వేల పరుగుల మెలురాయిని చేరుకుంటాడు. అదే సమయంలో టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ ను అధిగమిస్తాడు.
టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడి రికార్డు ప్రస్తుతం గేల్ పేరిట ఉంది. గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ 405 ఇన్నింగ్స్‌ల్లో 13894 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కాకున్నా కూడా గేల్ రికార్డును బ్రేక్ చేసేందుకు కోహ్లీకి మరో 16 ఇన్నింగ్స్‌ల సమయం ఉంది.
అంతేకాకుండా.. కోహ్లీ మరో ఘనతను అందుకోనున్నాడు. టీ20 క్రికెట్లో 14వేల పరుగుల మైలురాయిని చేరుకన్న తొలి భారత క్రికెటర్‌గా అవతరించనున్నాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 405 ఇన్నింగ్స్‌లలో 13894 పరుగులు
* రోహిత్ శర్మ – 454 ఇన్నింగ్స్‌లలో 12385 పరుగులు
* శిఖర్ ధావన్ – 331 ఇన్నింగ్స్‌లలో 9797 పరుగులు
* సూర్యకుమార్ యాదవ్ – 341 ఇన్నింగ్స్‌లలో 9616 పరుగులు
* సంజూ శాంసన్ – 321 ఇన్నింగ్స్‌లలో 8704 పరుగులు
