Adivi Sesh : బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్..
అడివి శేష్ ఈ ఇంటర్వ్యూలో బాహుబలి సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపాడు. (Adivi Sesh)
Adivi Sesh
Adivi Sesh : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్ డెకాయిట్ సినిమాతో ఏప్రిల్ 10న రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అడివి శేష్. ఈ ఇంటర్వ్యూలో బాహుబలి సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపాడు.
Also See : Shanmukh Jaswanth : వైష్ణవిని సైలెంట్ గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్..? ఫోటోలు వైరల్..
అడివి శేష్ మాట్లాడుతూ.. బాహుబలిలో అనుష్క ని కాలు పెట్టి తన్నే సీన్ ఉంటుంది. నేను మొదట భయం భయంగా చేస్తుంటే రాజమౌళి గారు శేష్ ఆ పవర్ కనిపించట్లేదు, ఆ పవర్ రావట్లేదు గట్టిగా చెయ్యి అంటే చేశాను. అనుష్క గారికి దెబ్బ తగిలింది. ఆమె మెడ దగ్గర బెణికి గాయం అయింది. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉన్నా. ప్రతిసారి తనతో అలాంటి సీన్ ఉంటే అవ్వగానే ఏం అవ్వలేదు కదా, బాగానే ఉంది కదా అని అడిగేవాడిని. తనని బల్లెంతో కొట్టి లేపే సీన్ లో కూడా జాగ్రత్తగా చేసి సీన్ అయ్యాక మీకు ఏం తగల్లేదు కదా అని అడిగా అని చెప్పుకొచ్చాడు.
