Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్‌లో కలకలం..! ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్..! ఎజెండా ఏంటి?
ఒకవేళ మంత్రి పదవి రాకపోతే డైరెక్టుగా సీఎం అవుతానంటూ వ్యాఖ్యనించారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.
Komatireddy Raj Gopal Reddy Representative Image (Image Credit To Original Source)
- 15 మంది ఎమ్మెల్యేలకు డిన్నర్ మీటింగ్ ఆహ్వానం?
- రహస్య సమావేశానికి హాజరైన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
- కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్ వెనుక ఆంతర్యం ఏంటీ?
- మంత్రి పదవి దక్కలేదని రగలిపోతున్న రాజగోపాల్‌రెడ్డి
Komatireddy Raj Gopal Reddy: అధికార పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం. పైగా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో.. రగిలిపోతున్న ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సీక్రెట్ మీటింగ్. ఇప్పుడీ వార్త. తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఎస్పెషల్ గా అధికార కాంగ్రెస్‌లో హైవోల్టేజ్ హీట్‌ను క్రియేట్ చేస్తుంది. అసలు డిన్నర్ మీట్‌కు ఎవరెవరికి ఆహ్వానం అందింది? హాజరైంది ఎవరు? సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటి?
మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం. 9 మంది ఎమ్మెల్యేలు హాజరు. వచ్చిన వాళ్లతో సీక్రెట్ డిన్నర్ మీటింగ్. అవును..తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు పొలిటికల్ సెన్సేషనల్ టాపిక్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచర ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారన్న టాక్ అధికార కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి..ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది.
సీఎం రేవంత్ అడ్డు కాలు వేస్తున్నారని ఆగ్రహం..
చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి..అమాత్య యోగం దక్కకపోవడంతో ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడల్లా తనకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురవుతూ వస్తోంది. దీంతో తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డే అడ్డు కాలు వేస్తున్నారని ఆగ్రహంగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పబ్లిక్ డయాస్ అయినా..మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడినా బ్లాస్టింగ్ కామెంట్స్ చేస్తూ..చర్చకు, రచ్చకు తెరలేపుతున్నారాయన.
సీఎం కావటమే టార్గెట్ అని ప్రకటన..
మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు ఈ మధ్యే చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే డైరెక్టుగా సీఎం అవుతానంటూ వ్యాఖ్యనించారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. తాను ఇంకా వేచి చూస్తానని..పదవి కోసం తన బాధ కాదని అన్నారు. అభివృద్ధే తన లక్ష్యమని..తనను మంత్రిని చేయకపోతే సీఎం కావటమే తన టార్గెట్ అని కుండబద్దలు కొట్టి చెప్పారు.
సీక్రెట్ డిన్నర్ మీటింగ్‌లో ఏం మాట్లాడారు?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సీక్రెట్ డిన్నర్ మీటింగ్ అధికార కాంగ్రెస్‌లో కలకలం రేపుతుంది. నాలుగు రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా 9 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి మీటింగ్‌కు హాజరైనట్లు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీక్రెట్‌గా భేటీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరిపిన సీక్రెట్ డిన్నర్ మీటింగ్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది.
మంత్రి పదవి ఇవ్వకపోతే తానే ముఖ్యమంత్రి అవుతానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, 9 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశానికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది సాధారణ సమావేశమేనా లేదంటే కొత్త రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువు కాబోతోందా అన్న సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్ పెట్టడం ఆ పార్టీలో కాక రేపుతోంది.
అయితే మంత్రి పదవి దక్కితేనే రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి చల్లారే పరిస్థితి ఉందంటున్నారు లీడర్లు. ఆయనకు అమాత్యయోగం కల్పిస్తే ప్లస్ ఎంత మైనస్ ఎంత బేరీజు వేసుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. ఇలాంటి నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి సీక్రెట్ మీటింగ్ ఎజెండా ఏంటి..అందులో ఏయే అంశాలపై చర్చించారనేది ప్రస్తుతానికి అయితే ఉత్కంఠగా కొనసాగుతోంది. తేడా వస్తే ఎంతకైనా సిద్దమని చెప్పేందుకే ఈ మీటింగ్ కోమటిరెడ్డి పెట్టారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలెవరని అటు ఇంటెలిజెన్స్..ఇటు మిగతా ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారట.
Also Read: పోలీసులను గాయపరిచి పారిపోవాలని ప్లాన్..! మొయినాబాద్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
