Komatireddy RajGopal Reddy : యాదగిరిగుట్ట బోర్డు నియామకంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి.. అందుకే నల్గొండ సభకు వెళ్లలేదని క్లారిటీ
Komatireddy RajGopal Reddy : ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగాలేదని, రాహుల్ గాంధీని కలిసి అన్ని విషయాలు చెప్పానని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మీనాక్షిని కలిసి అన్ని విషయాలు చెప్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Komatireddy RajGopal Reddy
- ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగాలేదు
- హైదరాబాద్లో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా?
- యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లను నియమించేటప్పుడు నాకు చెప్పరా?
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Komatireddy RajGopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ పెద్దల తీరుపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం 10టీవీతో మాట్లాడిన ఆయన నల్గొండ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) నియామకంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : Petrol Price Reduced : వాహనదారులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే!
ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగాలేదని, రాహుల్ గాంధీని కలిసి అన్ని విషయాలు చెప్పానని, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మీనాక్షిని కలిసి అన్ని విషయాలు చెప్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. వీళ్ల వ్యవహారం నచ్చకనే మొన్న నల్గొండ మీటింగ్ కు వెళ్లలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) నియామకంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లను నియమించేటప్పుడు నాకు చెప్పరా?
అంటూ ప్రశ్నించారు. మునుగోడు నుండి ఒక వ్యక్తిని మెంబర్ గా వేశారు
. మెంబర్ గా వేసిన విషయం నాకు తెలియనే తెలియదు. నేను యాదగిరి జిల్లా ఎమ్మెల్యేను, సీనియర్ కాంగ్రెస్ నేతను. నా అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే ఎలాంటి అంటూ ఆయన ప్రశ్నించారు.
