OPPO Find X9s : సూపర్ డిస్కౌంట్.. ఈ ఒప్పో ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
OPPO Find X9s : ఒప్పో ఫైండ్ X9ఎస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా ఫోన్ రూ. 4,500 తక్కువకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
OPPO Find X9s
- ఒప్పో ఫైండ్ X9s ప్రారంభ ధరపై 44శాతం తగ్గింపుతో లభిస్తోంది
- బ్యాంకు ఆఫర్లతో కొంటే చాలా తక్కువ ధరకే పొందొచ్చు
- ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా భారీ ఆదా
OPPO Find X9s : ఒప్పో ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఒప్పో ఫైండ్ X9s అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు ప్రారంభ ధర నుంచి రూ.4వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్లో భారీ 7025mAh బ్యాటరీ ఉంది.
కంపెనీ ఈ ఫోన్లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 32MP, అద్భుతమైన సెల్ఫీలు తీయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్పై లేటెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ ధర తగ్గింపు ఆఫర్ :
ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,59,999 ధరలో లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో లిస్ట్ చేసింది. ఒప్పో ఫైండ్ X9s ఫోన్ అసలు ధరపై 44శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది. తద్వారా ధర రూ.89,999కి తగ్గింది. అంటే.. రూ.60వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ రూ.89,999 చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఒప్పో బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ :
మీరు బ్యాంక్ ఆఫర్‌తో ఒప్పో ఫైండ్ X9s చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొనేస్తే రూ.4,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌పై ఇదే బెస్ట్ డీల్.
Read Also : Maharashtra Hostel : అమరావతి హాస్టల్లో దెయ్యాల కలకలం.. 608 మంది విద్యార్థులు ఖాళీ!
ఒప్పో ఫైండ్ X9s స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X9s ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్, 256GB/512GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఇందులో ఇన్-డిస్ప్లే 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7025mAh బ్యాటరీతో వస్తుంది.
ఒప్పో ఫైండ్ X9s బ్యాక్ సైడ్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.6 అపర్చర్ OISతో 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ బరువు 202 గ్రాములు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.1, జీపీఎస్, NFC ఉన్నాయి.
