Rewind 2025: 2025 బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు.. అంచనాలకు మించి..
2025 ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ ఇయర్ గా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి(Rewind 2025). మరి ఆ సినిమాలు ఏంటి? ఆ సినిమాల ప్రత్యేకత ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Tollywood industry Blockbuster films of 2025
Rewind 2025; 2025 ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ ఇయర్ గా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఆడియన్స్ ను అలరించాయి.(Rewind 2025) మరి ఆ సినిమాలు ఏంటి? ఆ సినిమాల ప్రత్యేకత ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతికి వస్తున్నాం: విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. పూర్తి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో నవ్వించింది. 2025 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇయర్ స్టార్టింగ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
తండేల్: అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ హిట్ గా నిలిచింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు దేశ భక్తి రెండు ఎమోషన్స్ తెరపై చక్కాగా పండాయి. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ వెరసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఈ సినిమా కూడా రూ.100 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
కోర్ట్: అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన సినిమా కోర్ట్. ఫోక్సో చట్టం ఎలా దుర్వినియోగం చేయబడుతుంది. ఆ చట్టం వల్ల నేరం చేయనివారు ఎలా బలవుతున్నారు అనేది క్లియర్ గా చూపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. ఆ కథకి తోడు అందమైన ప్రేమకథ, అద్భుతమైన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించడంతో ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ సినిమా కేవలం విజయం సాధించడమే కాదు చిత్ర యూనిట్ కు ప్రశంసలు కూడా తెచ్చిపెట్టింది.
హిట్ 3: నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మూవీ హిట్ 3. దర్శకుడు శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో నాని లోని మరో వైలెంట్ యాంగిల్ ని ఆడియన్స్ కు పరిచయం చేసిన ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కూడా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్ లో మరో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.
కుబేర: తమిళ స్టార్ ధనుష్ తెలుగులో హీరోగా చేసిన సినిమా కుబేర. ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో నటించలేదు జీవించాడు అనే చెప్పాలి. ఎమోషనల్ కథ, ఆ కథకి తగ్గ నటన నిజంగా అద్భుతం అనే చెప్పాలి. నాగార్జున, రష్మిక ఒక రేంజ్ లో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక శేఖర్ కమ్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కన్నప్ప: మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా వచ్చిన సినిమా కన్నప్ప. పరమశివుడి భక్తుడు కన్నప్ప జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను భక్తి పారవశ్యంలో ముంచేసింది. కన్నప్పగా మంచు విష్ణు అద్భుతమైన నటనని కనబరిచాడు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ అలరించగా.. రుద్ర పాత్రలో ప్రభాస్ సినిమాకె హైలెట్ గా నిలిచాడు. దీంతో, ఈ సినిమా కూడా 2025లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మిరాయ్: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ మిరాయ్. సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. కళ్ళు చెదిరే విజువల్స్, అద్భుతమైన మ్యూజిక్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఇక దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ కథకు ఇచ్చిన ఆ డివోషనల్ కనెక్షన్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసింది. క్లిమక్స్ లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్స్ బిలాస్ అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
ఓజీ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అచ్చు అదే రేంజ్ లో ఆయన్ని ప్రెజెంట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సుజీత్. పాటలు, ఫైట్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఫ్యాన్స్ వెర్రెక్కిపోయారు. దాంతో ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అఖండ 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.59 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. బోయపాటి టేకింగ్, డివోషనల్ టచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఆడియన్స్ ఈసినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో, బాలయ్య బాబు కెరీర్ లో, 2025 లిస్టులో మరో బ్లాక్ బస్టర్ చేరింది.
మరి మీరు ఈ సినిమాల్లో ఏదైనా మిస్ అయ్యుంటే వెంటనే తప్పకుండా చూడండి.
