Realme Narzo 90 Series : కొత్త రియల్‌మి నార్జో 90 సిరీస్ వచ్చేస్తోందోచ్.. AI ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Realme Narzo 90 Series : రియల్‌మి నార్జో 90 5జీ, నార్జో 90x 5జీ డిసెంబర్ మూడో వారంలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
Realme Narzo 90 Series
Realme Narzo 90 5G : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నార్జో 90x 5G సిరీస్ డిసెంబర్ 3వ వారంలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు రియల్‌మి నార్జో 90 సిరీస్‌లో రానున్నాయి. అమెజాన్‌లో ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇటీవల ఈ రెండు ఫోన్‌ల డిజైన్ టీజ్ చేసింది. ఇప్పుడు, రాబోయే నార్జో 90 సిరీస్ కోసం మైక్రోసైట్ అప్‌డేట్ చేసింది.
సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను రివీల్ చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్స్ 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh బ్యాటరీతో పవర్ పొందుతాయి. ఇంకా, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంటాయి.
రియల్‌మి నార్జో 90 సిరీస్ స్పెసిఫికేషన్లు :
అమెజాన్‌లో రాబోయే రియల్‌మి హ్యాండ్‌సెట్ కోసం మైక్రోసైట్ అప్‌డేట్ అయింది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్, కెమెరా కాన్ఫిగరేషన్ డిస్‌ప్లే ఫీచర్లతో సహా కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తుంది.
రియల్‌మి నార్జో 90 5G ఫోన్ 7,000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 60W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
స్టాండర్డ్ మోడల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లతో కూడా వస్తుంది. రియల్‌మి నార్జో 90 5G ఒక్కసారి ఛార్జ్ చేస్తే 143.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 8.1 గంటల గేమింగ్, 24 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్ 28.2 గంటల వీడియో కాలింగ్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్ 3 లెన్స్‌లతో కూడిన చదరపు బ్యాక్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
రియల్‌మి నార్జో 90x 5G, రియల్‌మి నార్జో 90 5జీ మాదిరిగా బ్యాటరీని కలిగి ఉంటుంది. కానీ, బైపాస్ ఛార్జింగ్, వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వదు. ఈ ఫోన్ రెండు కెమెరాలతో రెక్టాంగులర్ డిస్‌ప్లేతో వస్తుంది.
రియల్‌మి నార్జో 90 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ఏఐ ఎడిట్ జెనీ, ఏఐ ఎడిటర్, ఏఐ ఎరేజర్ ఏఐ అల్ట్రా క్లారిటీ వంటి అనేక ఏఐ టూల్స్ ఉంటాయి.
డిసెంబర్ 16న భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 90 5G, నార్జో 90x 5జీ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్ల ధరలు వరుసగా రూ. 17,999, రూ. 14,999 ఉండొచ్చు.
