AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అరెస్ట్.. వాట్ నెక్స్ట్..? ఉచ్చు ఎవరి మెడకు?
ఆల్మోస్ట్ రాజ్ కసిరెడ్డి తప్ప కీలక నిందితులుగా ఆరోపించబడ్డ వారంతా బెయిల్ మీద బయట ఉండగా..సడెన్‌గా ముప్పిడి అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవడం కొత్త చర్చకు దారితీస్తోంది.
AP Liquor Scam Case Representative Image (Image Credit To Original Source)
- మద్యం కుంభకోణం కేసులో A7గా ముప్పిడి అవినాశ్‌రెడ్డి
- ముడుపుల వ్యవహారంలో ముప్పిడి అవినాశ్‌పై ఆరోపణలు
- ఇప్పటికే చెవిరెడ్డితో సహా పలువురికి బెయిల్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి మూమెంటమ్ స్పీడప్ అవుతోంది. కొన్నాళ్లు స్తబ్ధతగా కనిపించింది. తర్వాత పలువురు నిందితులకు బెయిల్ రావడంతో..ఆల్ మోస్ట్ క్లైమాక్స్‌కు వచ్చినట్లే అన్న ప్రచారం జరిగింది. కట్ చేస్తే మరో కీలక అరెస్ట్ తెరమీదకు వచ్చింది. మద్యం కుంభకోణం కేసులో A7గా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ముప్పిడి అవినాశ్ రెడ్డి..సిట్ ముందు లొంగిపోగా..ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. సాక్షుల వాంగ్మూలాలు, టెక్నికల్ ఎవిడెన్స్‌లు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను బేస్ చేసుకుని ముప్పిడి అవినాశ్ రెడ్డి పాత్రను నిర్ధారించినట్లు కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు.
సిట్ ఏర్పాటు కాగానే విదేశాలకు పారిపోయిన అవినాశ్..
ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డితో కలిసి లిక్కర్ దందా నడిపించడంలో ముప్పిడి అవినాశ్ కీ రోల్ ప్లే చేశారని ఆరోపించారు. లిక్కర్ సిండికేట్‌కు అవినాశ్ రెడ్డే ప్రధాన వ్యూహకర్తగా ఉంటూ లావాదేవీలు నిర్వహించాడని..వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేశాడని సిట్ కోర్టుకు తెలిపింది. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ డిజైన్ నుంచి సమావేశాలు, ముడుపుల వ్యవహారం నడిపించాడని చెప్పుకొచ్చారు. ఎలాంటి హోదా లేకపోయినా అధికారులు, ఇప్పుడు లిక్కర్ కేసులో నిందితులకు ఉన్న వారికి అవినాశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సిట్ తెలిపింది. 2025 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు కాగానే ముప్పిడి అవినాశ్ రెడ్డి విదేశాలకు పారిపోయినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు దర్యాప్తు అధికారులు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగుబాటు..
ఇక లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు గత నెలలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. లేటెస్ట్గా అరెస్ట్ అయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లగా..అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయన సిట్ ముందు లొంగిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో గతంలోనే మాజీ సీఎం జగన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహా మరొకరికి బెయిల్ వచ్చింది. నెల రోజుల కింద మరో ముగ్గురికి కూడా బెయిల్ లభించింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
అయితే లిక్కర్ కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు..కీ రోల్ ప్లే చేశారని ఆరోపించబడుతున్న వాళ్లంతా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురి ఆస్తులను జప్తు చేసింది సిట్. లాస్ట్‌కు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఆయనిప్పుడు కండీషన్ బెయిల్ మీదున్నారు. ఇక నిందితులు, వారి కంపెనీలకు సంబంధించి సిట్ ఇప్పటికే రూ.62.85 కోట్లు విలువ చేసే నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసింది. కేసు దర్యాప్తు స్టార్టింగ్‌లో హైదరాబాద్‌లో 11 కోట్ల రూపాయలు పట్టుకుంది సిట్. ఇప్పటివరకు స్టేట్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ సిట్ టీమే కేసును దర్యాప్తు చేస్తుంది.
అటు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన సిట్.. కొన్ని వందల మందిని విచారించింది. ఇప్పటికే సిట్ పెట్టిన కేసులు..చేస్తున్న అలిగేషన్స్..ఛార్జిషీట్లో పేర్కొన్న అంశాలే నిందితులకు తీవ్ర హెడెక్‌గా మారాయి. ఓవైపు ఆస్తులు అటాచ్మెంట్..ఇంకోవైపు కొత్తగా ముప్పిడి అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌తో కేసు మరింత స్ట్రాంగ్ మారుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎంపీ మిథున్‌రెడ్డి కూడా షరతులతో కూడిన బెయిల్ మీదే బయట ఉన్నారు. ఆయనను సిట్ మళ్లీ విచారించడమో..లేక బెయిల్ రద్దు కోసం కోర్టుకెళ్లడమో ఏదో ఒకటి చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరోవైపు లిక్కర్ కేసులో తదుపరి అరెస్టులు ఉంటాయో లేదో కానీ..ఇప్పుటివరకు అరెస్ట్ అయిన నిందితులు అయితే పూర్తిగా కార్నర్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఎనిమిది మంది బెయిల్‌పై రిలీజ్ కాగా..రెగ్యులర్ బెయిల్ కోసం ట్రై చేసి..ఏసీబీ కోర్టు, హైకోర్టు..లేకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కి రిలీఫ్ పొందాల్సిన పరిస్థితి.
మరోసారి వైసీపీలో కలవరం..
ఈ క్రమంలోనే ముప్పిడి అవినాశ్‌రెడ్డి అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరోసారి వైసీపీలో కలవరానికి దారితీసిందన్న చర్చ జరుగుతోంది. ఆల్మోస్ట్ రాజ్ కసిరెడ్డి తప్ప కీలక నిందితులుగా ఆరోపించబడ్డ వారంతా బెయిల్ మీద బయట ఉండగా..సడెన్‌గా ముప్పిడి అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో వాట్ నెక్స్ట్ అన్నది సస్పెన్స్‌గా మారింది. ఏపీ లిక్కర్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో..ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో చూడాలి.
Also Read: అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. మండలిలో బిగ్ ఫైట్
