AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5వేలు జమ..
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతాల్లో రూ.5వేలు జమ చేసేందుకు సిద్ధమైంది.
AP Government
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రాజధానిలోని భూమిలేని రైతులకు శుభవార్త
- బ్యాంక్ ఖాతాల్లోకి జమకానున్న రూ.5వేలు
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు శుభవార్త చెప్పింది. రాజధాని గ్రామాల్లో అర్హులైన భూమిలేని పేదలకు పింఛన్లు చెల్లించేందుకు రూ.26.92 కోట్లు విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.
Also Read : Delhi High Court : మహిళను చెంపదెబ్బ కొట్టిన కేసు.. పోలీసు అధికారిపై ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం
అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ సమయంలో ఉపాధి కోల్పోయిన భూమిలేని పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు నెలకు రూ.5వేలు పింఛన్ అందజేస్తున్నారు. గతంలో ఈ పింఛన్లు అమలులో ఉన్నన్పటికీ.. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పునరుద్దరించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గత ఏడాది మంత్రివర్గ ఆమోదం తెలిపింది. దీంతో సీఆర్డీఏ కార్యాలయాలు, గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తూ ప్రభుత్వం ఫించన్లు మంజూరు చేస్తోంది.
భూమిలేని పేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించిన మైనర్ పిల్లలకు కూడా పింఛన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలాఉంటే.. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ చట్టంలో సవరణలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరాలు, పట్టణాలకు ఆనుకొనిఉన్న గ్రామాల్లో భూముల పరిహారం చెల్లింపు విధానంలో మార్పులకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువకు 1.25 రెట్లు పెంచి, దానిపై మరో 100 శాతం సోలేషియం జోడించి పరిహారం చెల్లించే విధానంలో మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మరోవైపు, అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో స్పీడ్, నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల వ్యయంతో 95 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ప్రతి నెల కనీసం 7.92 శాతం పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
రాజధాని అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం చేయకుండా.. విజయవాడ, గుంటూరుతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
