Free Mobile Games : గేమ్స్ ఆడుతూ డబ్బు సంపాదించుకోవచ్చు.. ఈ 7 ఫ్రీ మొబైల్ గేమ్స్ ఓసారి ట్రై చేయండి..!
Free Mobile Games : 2026లో రివార్డ్స్ అందించే అద్భుతమైన 7 ఫ్రీ మొబైల్ గేమ్స్ ఏంటో తెలుసా? గేమ్ ఆడుతూ రివార్డ్స్ సంపాదించుకోవచ్చు. పేపాల్ ఆప్షన్లు, విత్‌డ్రాయల్ నిబంధనలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Free Mobile Games
- టైమ్పాస్తో పాటు రివార్డ్స్.. 7 మొబైల్ గేమ్స్ ట్రై చేశారా?
- పజిల్స్ సాల్వ్ చేస్తూ రివార్డ్స్ సంపాదించుకోవచ్చు
- ఆడండి.. పాయింట్లు సంపాదించండి.. రివార్డ్ గేమ్స్ ఇవే
Free Mobile Games : మీకు మొబైల్లో గేమ్స్ ఆడటం సరదానా? అయితే ఇది మీకోసమే.. ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడితే రివార్డ్స్ సంపాదించుకోవచ్చు. అందులో పజిల్స్ సాల్వ్ చేయడం, వస్తువులను మ్యాచ్ చేయడం, లెవెల్స్ పూర్తి చేయడం వంటి టాస్కులు పూర్తి చేస్తే చాలు.. పాయింట్లు లేదా కాయిన్లు సంపాదించవచ్చు.
కొన్ని యాప్స్ ద్వారా క్యాష్ లేదా గిఫ్ట్ కార్డులుగా రీడీమ్ చేసుకునే ఆప్షన్లు అందిస్తున్నాయి. మీకు ఈ గేమ్స్ ఆడితే ఎంత డబ్బు వస్తుందనేది మాత్రం ఫిక్స్‌డ్‌గా ఉండదు. ఇంతకీ అలాంటి 7 ఫ్రీ గేమ్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
1. పిగ్గీ మ్యాచ్ విన్ క్యాష్ :
పజిల్ గేమ్స్ ఆడటం ఇష్టమైతే (Piggy Match) ఆడొచ్చు. ఇందులో ఒకే రకమైన వస్తువులను మ్యాచ్ చేస్తూ బోర్డును (Free Mobile Games) క్లియర్ చేయాలి. లెవెల్స్ పూర్తి చేస్తే పాయింట్లు, కాయిన్లు, రివార్డులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పిగ్గీ ద్వారా బోనస్ రివార్డులు ఉంటాయి. ఈ యాప్‌లో PayPal, Cash App, గిఫ్ట్ కార్డుల వంటి రిడెంప్షన్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఇవన్నీ అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు.
2. క్రేజీ 3D 2048 రియల్ క్యాష్ :
2048 పజిల్ మీకు తెలిసే ఉంటుంది. ఇదే కాన్సెప్ట్‌ను 3డీ రూపంలో తీసుకొచ్చిన గేమ్ ఇది. నంబర్ ఉన్న క్యూబ్‌లను స్వైప్ చేసి ఒకే నంబర్లను కలపాలి. ఇలా చేస్తూ పెద్ద నంబర్లను క్రియేట్ చేయాలి. గేమ్ ఆడుతున్నప్పుడు రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయని యాప్ అంటోంది. పేపాల్, క్యాష్ యాప్, గిఫ్ట్ కార్డుల వంటి రిడెంప్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చు. అయితే, గ్యారెంటీగా ఇంత డబ్బు వస్తుందని మాత్రం చెప్పలేం.
3. స్క్రూడమ్ విన్ క్యాష్ :
స్క్రూలు, పిన్స్‌తో పజిల్స్ సాల్వ్ చేయడమే ఈ గేమ్.. మీకు ఆసక్తిగా ఉంటే (Screwdom) ట్రై చేయవచ్చు. ఇందులో రంగురంగుల స్క్రూలను సరైన క్రమంలో తీసి వాటికి సరిపోయే చోట అమర్చాలి. ప్రతి లెవెల్లో పజిల్ కొంచెం కష్టంగా మారుతుంది. లెవెల్స్, రోజువారీ టాస్కులు పూర్తి చేస్తే రివార్డ్ పాయింట్లు వస్తాయి. అర్హత ఉంటే క్యాష్ లేదా గిఫ్ట్ కార్డుల రూపంలో రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
4. గూడ్స్ మ్యాచ్ విన్ క్యాష్ :
సూపర్‌మార్కెట్ షెల్ఫ్‌లో వస్తువులను సర్దినట్టు ఆడే గేమ్ గూడ్స్ మ్యాచ్. ఫోన్ స్క్రీన్‌పై కనిపించే ఒకే రకమైన వస్తువులను గుర్తించి మ్యాచ్ చేయాలి. లెవెల్ పూర్తయ్యే కొద్దీ కొత్త టాస్కులు వస్తాయి. గేమ్‌ప్లే ద్వారా రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. పేపాల్, క్యాష్ యాప్, అమెజాన్ గిఫ్ట్ కార్డుల వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అందరి యూజర్లకు ఉండకపోవచ్చు.
5. ఫ్రూట్ మ్యాచ్ రియల్ రివార్డు :
పండ్లతో కలర్‌ఫుల్ పజిల్స్ ఆడాలంటే ఫ్రూట్ మ్యాచ్ అద్భుతమైన ఆప్షన్. ఒకే రకమైన పండ్లను మ్యాచ్ చేసి కాంబినేషన్లు తయారు చేయాలి. లెవెల్స్ పూర్తి చేస్తూ రివార్డులు సేకరించవచ్చు. యాప్ పేపాల్ విత్‌డ్రాయల్ ద్వారా డ్రా చేయొచ్చు. కానీ, యాప్ డెవలపర్ ఇది ఆదాయ మార్గం కాదని, కేవలం ఫన్ కోసమే రూపొందించినట్టు చెబుతున్నారు.
6. హెక్సా సార్ట్ రియల్ రివార్డు :
ఈ హెక్సా సార్ట్ గేమ్ రంగులను సరిగ్గా సార్ట్ చేయడం, షట్కోణ టైల్స్‌ను సరైన విధంగా అమర్చడమే మెయిన్ టాస్క్. మొదట ఈజీగా అనిపించినా, లెవెల్స్ పెరిగే కొద్దీ పజిల్ కాస్త కష్టంగా మారుతుంది. లెవెల్స్, రోజువారీ టాస్కులు, మైల్ స్టోన్స్ పూర్తి చేస్తే కాయిన్లు సేకరించవచ్చు. కొన్ని సందర్భాల్లో కనీస బ్యాలెన్స్ రీచ్ అయ్యాక వాటిని రివార్డులుగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
7. షుగర్ మ్యాచ్ గేమ్ రియల్ రివార్డు :
క్యాండీలు మ్యాచ్ చేసే సాధారణ పజిల్ గేమ్ షుగర్ మ్యాచ్ గేమ్.. ఒకే రకమైన క్యాండీలను మ్యాచ్ చేస్తూ బోర్డును క్లియర్ చేయాలి. లెవెల్స్ పూర్తి చేయడం, రోజువారీ టాస్కులు చేయడం, బోనస్‌లు పొందడం ద్వారా కాయిన్లు సేకరించవచ్చు. అర్హత ఉన్న ఆటగాళ్లు ఈ కాయిన్లను అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ల ద్వారా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఎంత డబ్బు వస్తుందనే విషయంలో గ్యారెంటీ ఉండదు.
ఆడే ముందు తప్పక గుర్తుంచుకోండి :
ఈ గేమ్స్ డబ్బు సంపాదించిపెట్టే ఉద్యోగంలా చూడొద్దు. రివార్డులు దొరికితే అదనపు బెనిఫిట్ అంతే.. ఆడే ముందు కనీస విత్‌డ్రాయల్ మొత్తం, పేమెంట్ మెథడ్స్, మీ ప్రాంతంలో రివార్డులు అందుబాటులో ఉన్నాయా లేదా, యాప్ నిబంధనలు వంటి వాటిని చెక్ చేయండి. రివార్డ్ వస్తుందని చెప్పి ముందుగా డబ్బులు చెల్లించమంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే యూపీఐ పిన్, ఓటీపీ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి.
