Top 5 Mobile Phones : కంటెంట్ క్రియేటర్లకు పండగే.. మీ మొబైల్‌తోనే హై-క్వాలిటీ మూవీ షాట్స్ తీయొచ్చు.. టాప్ 5 స్మార్ట్ఫోన్లు మీకోసం..!
Top 5 Mobile Phones : 2026లో మొబైల్ ఫోన్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ వీడియోలు తీయొచ్చు తెలుసా? శాంసంగ్ గెలాక్సీ ఎ56 5జీ నుంచి రియల్‌మి 16 ప్రో ప్లస్ 5జీ వరకు ఏయే ఫోన్లు అందుబాటులో ఉన్నాయంటే?
Top 5 Mobile Phones
- కంటెంట్ క్రియేటర్ల కోసం ఫిల్మ్ మేకింగ్ మొబైల్ ఫోన్లు
- సినిమాటిక్ ఫీల్‌తో హై క్వాలిటీ వీడియోలు రికార్డింగ్
- భారత మార్కెట్లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు, ధర ఫీచర్ల వివరాలు
Top 5 Mobile Phones 2026 : మీకు సినిమా స్టయిల్లో వీడియోలు తీయాలని ఉందా? అచ్చం సినిమా షూటింగ్ షాట్స్ మాదిరిగానే మొబైల్‌తో వీడియోలు తీయొచ్చు. 2026లో మీరు రికార్డు చేసే వీడియోలు సినిమా లెవెల్లో ఉండాలన్నా లేదా వ్లాగ్స్ వైరల్ కావాలన్నా మీ చేతిలో సరైన స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. మొబైల్ ఫోన్ తోనే ఫిల్మ్ మేకింగ్ వీడియోలు రికార్డు చేయొచ్చు. అద్భుతమైన వీడియో క్వాలిటీ, సూపర్ స్టేబిలైజేషన్, పవర్ఫుల్ ప్రాసెసింగ్, భారీ డిస్ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈ ఫోన్లతో మీరు షార్ట్ ఫిల్మ్స్, వ్లాగ్స్, సోషల్ మీడియా వీడియోలు వంటి ఏదైనా వీడియోలను ప్రొఫెషనల్‌గా తీయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మీ కంటెంట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కోసం టాప్ 5 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫోన్ ఫుల్ ఫీచర్లు, ప్రస్తుత ధరలపై ఓసారి లుక్కేయండి.
1. శాంసంగ్ గెలాక్సీ A56 5జీ :
శాంసంగ్ ఫోన్ లవర్స్ ఈ ఫ్లాగ్షిప్ లెవల్ ఫోన్ తీసుకోవచ్చు. స్టేబుల్ సాఫ్ట్వేర్ హై క్వాలిటీ వీడియోలు ఇష్టపడే క్రియేటర్లకు శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ ఆల్ రౌండర్ ఆప్షన్లలో ఒకటి. 50MP మెయిన్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా రెండూ 30fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయొచ్చు.
ఈ ఫోన్ డ్యూయల్ 4K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రీల్స్‌కు బెస్ట్ ఫోన్. ఇందులో VDIS స్టెబిలైజేషన్ కూడా ఉంది. హ్యాండ్‌హెల్డ్ షాట్స్ చాలా స్మూత్‌గా వస్తాయి. ఈ ఫోన్ 1900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లేతో వచ్చింది. ఈ శాంసంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్ మార్చి 2, 2025న లాంచ్ కాగా ధర రూ. 38,999కు లభిస్తుంది.
2. వివో V70 5జీ :
వివో V70 5జీ ఫోన్ అనేది నేచురల్ స్కిన్ టోన్లు, ఫ్రంట్ కెమెరా పర్ఫర్మెన్స్ కోరుకునే వ్లాగర్లు, పోర్ట్రెయిట్ వీడియో క్రియేటర్లకు ఇంతకన్నా బెస్ట్ ఫోన్ దొరకదు. ఈ వివో ఫోన్లో 50MP IAF సెల్ఫీ కెమెరా ఉంది. 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
మూవింగ్ షాట్స్ కోసం ఈ ఫోన్ పర్ఫెక్ట్ అనమాట. తక్కువ కాంతిలో రికార్డింగ్ కోసం ఇంటర్నల్ రింగ్ లైట్ మాదిరిగా ఆరా లైట్ పోర్ట్రెయిట్ వీడియో ఫీచర్ ఉంది. ఈ ఫోన్ సినిమాటిక్ వీడియో మోడ్‌ను అందిస్తుంది. రియల్ టైమ్‌లో నేచురల్ బ్యాగ్ గ్రౌండ్ బ్లర్ అయ్యేలా చేయొచ్చు. ఫిబ్రవరి 2026లో లాంచ్ అయిన ఈ వివో 5జీ ఫోన్ ధర రూ. 45,999కు లభిస్తుంది.
Read Also : Best Budget Cars : కొత్త కారు కొంటున్నారా? మీ రూ. 40వేల జీతానికి ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు చాలా బెస్ట్..!
3. వన్‌ప్లస్ 15R 5జీ :
వన్‌ప్లస్ 15R 5జీ ఫోన్ ఆన్-డివైస్ వీడియో ఎడిటింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మిడ్ రేంజ్ ఫోన్లతో పోలిస్తే 4K వీడియో ఫాస్ట్ రికార్డ్ చేయొచ్చు.
బ్యాక్ సైడ్ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. స్మూత్ బి రోల్, యాక్షన్ షాట్లకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్లో భారీ 7400mAh బ్యాటరీ ఉంది. పవర్ బ్యాంక్ లేకుండా ఎక్కువ గంటలు వీడియోలు రికార్డు చేయొచ్చు. జనవరి 2026లో లాంచ్ అయిన ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర 47,998 నుంచి అందుబాటులో ఉంది.
4. గూగుల్ పిక్సెల్ 9a :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్. పెద్దగా ప్రాసెసింగ్ లేని వీడియోలకు బెటర్. ఈ ఫోన్ HDR ప్లస్ వీడియో ప్రాసెసింగ్, డైనమిక్ రేంజ్ కోసం ఆప్టిమైజ్ టెన్సర్ G4 చిప్సెట్తో వస్తుంది. వీడియో నుంచి మీ వాయిస్‌ను సపరేట్ చేయొచ్చు.
బయట రికార్డింగ్ సమయంలో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తగ్గించే స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ బ్లోట్‌వేర్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. క్విక్ వీడియో అప్‌లోడ్‌లకు బెస్ట్ ఫోన్. ఏప్రిల్ 2025లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర దాదాపు 39,930 నుంచి లభ్యమవుతుంది.
5. రియల్‌మి 16 ప్రో ప్లస్ 5జీ :
రియల్‌మి 16 ప్రో ప్లస్ 5G మొబైల్ ఫిల్మ్ మేకింగ్‌కు అద్భుతమైన ఫోన్. ఇందులో లాంగ్ జూమ్ షాట్ల కోసం స్పెషల్ పెరిస్కోప్ లెన్స్ ఉంది. బ్యాక్ సైడ్ 200MP మెయిన్ సెన్సార్ కూడా ఉంది. రీల్స్ కోసం హారిజంటెల్ వీడియోలను వర్టికల్ వీడియో ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దాదాపు 30 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ అవుతుంది. గత జనవరి 2026లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ. 34,999 నుంచి అందుబాటులో ఉంది.
