Nandamuri Mokshagna: మొదటి సినిమానే ఉపేంద్రతో.. సీక్వెల్ కోసమే.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు..
నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వినిపించాయి.
Upendra doing villain role in Nandamuri Mokshagna movie
Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వినిపించాయి. రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఒక సినిమా కూడా ఒకే అయ్యింది. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దీంతో, తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారసుడి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Manoj Bajpayee; బాలీవుడ్ లో అభద్రతా భావం ఎక్కువ.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోరు.. ఇక్కడ ఎలా ఉంటుందంటే..
దీంతో మరోసారి డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో ఊపిరి పీల్చుకున్నారు. రీసెంట్ గా గోవా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న బాలకృష్ణ తన వారసుడు మోక్షాజ్ఞ(Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ రాబోతుంది అని ప్రకటించాడు. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చెప్పుకోచ్చాడు. అలాగే ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని కూడా చెప్పాడు. దీంతో, నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ స్టార్ ఉపేంద్రను ఫిక్స్ చేశారట. ఆయన పాత్రకు సంబంధించి చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని టాక్. ఇక ఆయన పాత్ర కూడా చాలా విచిత్రంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి మొదటి సినిమాకే ఉపేంద్ర లాంటి నటుడితో చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఆయన ముందు మోక్షజ్ఞ ఎలా చేస్తాడు అనేది చూడాలి. ఇక భారీ గ్రాఫిక్స్ తో, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా 2026 ఉగాదికి మొదలుకానుందని సమాచారం.
