Social Media Ban : కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. దేశంలోనే తొలి రాష్ట్రం..
Social Media Ban : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు.
Social Media Ban
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
- 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
Social Media Ban : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
పిల్లల్లో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సీఎం సిద్ధరామయ్య గత నెలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌కు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు కోరారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణులు, పిల్లల అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా గత ఏడాది డిసెంబర్ నెలలో 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు చేపట్టాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రభుత్వం స్ఫూర్తితో యూరోపియన్ యూనియన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మరికొన్ని దేశాలు చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి.
భారత దేశం విషయానికి వస్తే.. చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించేలా ఆలోచన చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించామని అన్నారు. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది.
