Taj Falaknuma Palace : మెస్సీ బసచేసే ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఒకరోజు ఉండాలంటే ఎన్ని లక్షలో తెలుసా? దీని ప్రత్యేకతలు ఏమిటంటే?
Taj Falaknuma Palace : హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌గా పేరున్న ఫలక్‌నుమా ప్యాలెస్ మరోసారి వార్తల్లో నిలువనుంది. ఈ ప్యాలెస్ లో రకరకాల రూమ్స్ ఉన్నాయి.

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సి బస చేస్తారు. Image cradit @Taj Hotels

ఈనెల 13న (శనివారం) సాయంత్రం ప్యాలెస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ మెస్సీ’ పేరుతో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. Image cradit @Taj Hotels

మెస్సీ రాకతో హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌గా పేరున్న ఫలక్‌నుమా ప్యాలెస్ మరోసారి వార్తల్లో నిలువనుంది. Image cradit @Taj Hotels

అప్పటి నిజాం ప్రధాని వికార్ ఉల్ ఉమ్రా 1893లో నిర్మించిన ఈ అద్భుత కట్టడాన్ని 1895లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కొనుగోలు చేశారు. ఆయన ఇందులోనే ఉండేవారు. Image cradit @Taj Hotels

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను రాయల్ గెస్ట్‌హౌస్‌గా వినియోగించుకున్నారు. Image cradit @Taj Hotels

అనంతరం తాజ్ గ్రూప్ ఈ ప్యాలెస్‌ను లీజుకు తీసుకొని తాజ్ ఫలక్‌నుమా పేరిట స్టార్ హోటల్ నిర్వహిస్తోంది. Image cradit @Taj Hotels

మొట్ట మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1951లో ప్యాలెస్ ను సందర్శించారు. Image cradit @Taj Hotels

2014 నవంబర్ 18న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. తన సోదరి వివాహం తాజ్ ఫలక్‌నుమాలో వైభవంగా నిర్వహించారు. Image cradit @Taj Hotels

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్‌కు నాటి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌తోపాటు ప్రముఖులకు 2017 నవంబర్ 28న కేంద్ర ప్రభుత్వం 101 సీట్ల డైనింగ్ టేబుల్ పై విందు ఏర్పాటు చేసింది. Image cradit @Taj Hotels

ఈ ప్యాలెస్ లో రకరకాల రూమ్స్ ఉన్నాయి. గార్డెన్ వ్యూ, రాయల్ సూట్, గ్రాండ్ రాయల్ సూట్, సూట్ రకాన్ని బట్టి ధర ఉంటుంది. Image cradit @Taj Hotels

స్టాండర్ట్ అయితే ఒక్క నైట్ కు రూ.40వేల నుంచి రూ.42వేల వరకు ఉంటుంది. రూము స్థాయిని బట్టి రేటు పెరుగుతుంది. అత్యధికంగా సుమారు ఒక్కరోజుకు రూ.6లక్షలు ఉంటుంది. Image cradit @Taj Hotels

ఫెసిలిటీస్ ప్లష్ బెడ్డింగ్, వింటేజ్ డెకరేషన్, భారీ బాత్ టబ్స్, ఔట్ డోర్ ఏరియా, స్పా, స్విమింగ్ పూల్, ఫైన్ డైనింగ్, గుర్రపు బగ్గీలో ప్రయాణం, ప్రతి రూమ్ నుంచి గార్డెన్ వ్యూ ఉంటుంది. Image cradit @Taj Hotels

రూమ్ స్టే వేరే, డిన్నర్ కాస్ట్ వేరువేరుగా ఉంటుంది. దీన్ని తాజ్ హోటల్స్ నిర్వహిస్తోంది. Image cradit @Taj Hotels

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సంగీతం, ఆధ్యాత్మికత మరియు రాజ వైభవంతో కూడిన కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. Image cradit @Taj Hotels
