Hardik Pandya : హార్దిక్ ను తన గర్ల్‌ఫ్రెండ్ ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? వంద వికెట్లు తీయగానే..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
Do you know how Mahieka Sharma calls Hardik Pandya
Hardik Pandya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ఔట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. 123 మ్యాచ్‌ల్లో 26.78 సగటుతో 100 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/16.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా హార్దిక్ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఈ ఘనత అందుకున్నారు. టీమ్ఇండియా తరుపున టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడి హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
Milestone Moment!
That moment when Hardik Pandya became only the third #TeamIndia cricketer (in Men’s cricket) to scalp 100 T20I wickets 👏👏
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/XYDxMvrEPz
— BCCI (@BCCI) December 14, 2025
ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతడి ప్రియురాలు మహికా శర్మ సైతం హార్దిక్‌ను అభినందించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆమె ముద్దుగా బేబీ అని పిలుస్తోంది.
Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారతీయుడు..
100 బేబీ.. రాక్‌స్టార్ లెజెండ్ హీరో..!! అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐడెన్ మార్‌క్రమ్ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఆ తరువాత అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35 పరుగులు), శుభ్‌మన్ గిల్ (28), తిలక్‌వర్మ (26 నాటౌట్) రాణించడంతో 118 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
