Do you know how Mahieka Sharma calls Hardik Pandya
Hardik Pandya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ ఔట్ చేయడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. 123 మ్యాచ్‌ల్లో 26.78 సగటుతో 100 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/16.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా హార్దిక్ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఈ ఘనత అందుకున్నారు. టీమ్ఇండియా తరుపున టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడి హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
Milestone Moment!
That moment when Hardik Pandya became only the third #TeamIndia cricketer (in Men’s cricket) to scalp 100 T20I wickets 👏👏
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/XYDxMvrEPz
— BCCI (@BCCI) December 14, 2025
ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతడి ప్రియురాలు మహికా శర్మ సైతం హార్దిక్‌ను అభినందించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆమె ముద్దుగా బేబీ అని పిలుస్తోంది.
Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారతీయుడు..
100 బేబీ.. రాక్‌స్టార్ లెజెండ్ హీరో..!! అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐడెన్ మార్‌క్రమ్ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఆ తరువాత అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35 పరుగులు), శుభ్‌మన్ గిల్ (28), తిలక్‌వర్మ (26 నాటౌట్) రాణించడంతో 118 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.