T20 World Cup 2026 : సంజూ శాంసన్, గౌతమ్ గంభీర్‌ను ట్రోల్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. చివరికి అంటూ..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) విజయానంతరం సంజూ శాంసన్, గౌతమ్ గంభీర్ లను అర్ష్‌దీప్ సింగ్ ట్రోల్ చేశాడు.
T20 World Cup 2026 Arshdeep Singh Trolls Sanju Samson and Gautam Gambhir
- టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత్
- సంజూ శాంసన్, గౌతమ్ గంభీర్‌లను సరదాగా ట్రోల్ చేసిన అర్ష్‌దీప్ సింగ్
- చివరకు న్యాయం గెలిచింది, కాస్త నవ్వండి అంటూ
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత జట్టు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ సగర్వంగా కప్పును ముద్దాడింది. ఈ విజయంతో అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ భవితవ్యం పై ఇటు జట్టులో సంజూ శాంసన్ స్థానంపై ఓ స్పష్టత వచ్చేసినట్లే.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో సంజూ శాంసన్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే కాగా.. టీ20 ప్రపంచకప్ విజయంతో వన్డే ప్రపంచకప్ 2027 వరకు గంభీర్ హెడ్ కోచ్ పదవికి ఎలాంటి ముప్పు లేనట్లేననని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సంజూ శాంసన్, గౌతమ్ గంభీర్‌లను ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కాస్త కౌంటర్లుగా అర్ష్‌దీప్ సింగ్ .. వీరిద్దరితో కలిసి సరదాగా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Arshdeep singh with sanju samson on instagram 😭🤣❤️
“Oye paaji….justice mil gayaaaaa” pic.twitter.com/BFQvCCF6Ho
— lakshman (@rebel_notout) March 8, 2026
అప్పుడెప్పుడో భారత తరుపున టీ20ల్లో అరంగ్రేటం చేసినప్పటికి కూడా సంజూ శాంసన్ ఎప్పుడూ కూడా జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. అతడికి జట్టులో చోటు దక్కనప్పుడు ప్రతిసారి సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంజూ శాంసన్ అనే నినాదం ట్రెండ్ అయ్యేది. రోహిత్, కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలకడంతో సంజూ కు అవకాశాలు మెరుగు అయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. దీన్ని ప్రస్తావిస్తూ.. అర్ష్‌దీప్ “జస్టిస్ మిల్ గయా (చివరకు న్యాయం జరిగింది)” అని అన్నాడు.
INSTAGRAM REEL BY ARSHDEEP SINGH WITH GAMBHIR. 😂🔥 pic.twitter.com/yiWxE10tzy
— Johns. (@CricCrazyJohns) March 8, 2026
మరో వీడియోలో హెడ్ కోచ్‌ను గంభీర్ తో మాట్లాడుతూ.. సోదరా నువ్వు కొన్ని సార్లు అయినా నవ్వాలి అని ఆటపట్టించాడు.
