Nara Lokesh : సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్
Nara Lokesh visited Tirumala : సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో కలిసి మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Minister Nara Lokesh visited Lord Sri Venkateswara Swamy at Tirumala
Nara Lokesh visited Tirumala : సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో కలిసి మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఆ తరువాత సింగపూర్ హోం మంత్రితో కలిసి నారా లోకేశ్ తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగానాయకుల మంటపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలాఉంటే ఇవాళ మధ్యాహ్నం తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కేరళంకు మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు.
