భారతీయ రైల్వే  ప్రయాణీకులకు శుభవార్త

రైల్లో ప్రయాణించేటప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. 

IRCTC ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీస్ Zoop ఉపయోగించి రైల్వే ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు

WhatsApp చాట్‌బాట్ సర్వీసు ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. 

వాట్సాప్ ద్వారా రైలులో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేయాలంటే 

మీ WhatsAppలో Zoop చాట్‌బాట్‌ని ఓపెన్ చేయండి.

మీ 10-అంకెల PNR నంబర్‌ను నమోదు చేయండి. మీ రైలు, సీట్ నంబర్, బెర్త్ మొత్తం సమాచారాన్ని అందిస్తుంది.

Zoop మీ వివరాలను ధృవీకరిస్తుంది. మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్న రాబోయే స్టేషన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత, Zoop చాట్‌బాట్ మీరు ఆహారాన్ని ఆర్డర్ చేసే రెస్టారెంట్‌ల నుంచి మీకు ఆప్షన్ల సెట్‌ను అందిస్తుంది.

ప్రయాణీకులు చాట్‌బాట్‌లో ఆర్డర్, పేమెంట్ మోడ్‌కు సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందవచ్చు.