IRCTC Food Online : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!

IRCTC Food Online : భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైల్లో ప్రయాణించేటప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. IRCTC ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీస్ Zoop ఉపయోగించి రైల్వే ప్రయాణికులు తమ WhatsApp చాట్‌బాట్ సర్వీసు ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

IRCTC Food Online : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!

IRCTC Now lets you order food online on train using WhatsApp

IRCTC Food Online : భారతీయ రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైల్లో ప్రయాణించేటప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. IRCTC ద్వారా ఫుడ్ డెలివరీ సర్వీస్ Zoop ఉపయోగించి రైల్వే ప్రయాణికులు తమ WhatsApp చాట్‌బాట్ సర్వీసు ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. యూజర్లను అనుమతించేందుకు ఇటీవల Jio Haptikతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సాధారణ దశల్లోనే ప్రయాణీకులు రైలు సీటు నుంచి ఆర్డర్ చేసేటప్పుడు PNR నంబర్‌ ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

IRCTC ప్రయాణీకులు ఏ ఇతర అదనపు సాఫ్ట్‌వేర్/యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తోంది. Zoop కొత్త WhatsApp సర్వీసులుతో రాబోయే ఏ స్టేషన్‌లోనైనా ఆర్డర్ చేసేందుకు అనుమతిస్తుంది. రియల్ టైమ్ భోజనం ట్రాకింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడంలో ఎవరైనా ప్రయాణీకులకు ఇబ్బంది ఉంటే వారు నేరుగా చాట్‌బాట్‌లో సాయం అడగవచ్చు. మీరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా మంచి భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటే రైలులో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఈ కింది విధంగా ఫాలో అయితే చాలు..

IRCTC Now lets you order food online on train using WhatsApp

IRCTC Now lets you order food online on train using WhatsApp

వాట్సాప్ ద్వారా రైలులో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేయాలంటే :

– మీ ఫోన్‌లో Zoop WhatsApp చాట్‌బాట్‌లో నంబర్ +91 7042062070ని Save చేయండి.
– మీరు [https://wa.me/917042062070] (బ్రాకెట్‌లు లేకుండా)కి కూడా నావిగేట్ చేయవచ్చు.
– మీ WhatsAppలో Zoop చాట్‌బాట్‌ని ఓపెన్ చేయండి.
– మీ 10-అంకెల PNR నంబర్‌ను నమోదు చేయండి. మీ రైలు, సీట్ నంబర్, బెర్త్ మొత్తం సమాచారాన్ని అందిస్తుంది.
– Zoop మీ వివరాలను ధృవీకరిస్తుంది. మీరు ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్న రాబోయే స్టేషన్‌ను ఎంచుకోవాలి.
– ఆ తర్వాత, Zoop చాట్‌బాట్ మీరు ఆహారాన్ని ఆర్డర్ చేసే రెస్టారెంట్‌ల నుంచి మీకు ఆప్షన్ల సెట్‌ను అందిస్తుంది.
– ప్రయాణీకులు చాట్‌బాట్‌లో ఆర్డర్, పేమెంట్ మోడ్‌కు సంబంధించిన అన్ని వివరాలను కూడా పొందవచ్చు.
– ఆహారాన్ని ఆర్డర్ చేసి, లావాదేవీని పూర్తి చేసిన తర్వాత, మీరు చాట్‌బాట్ నుంచి మీ ఆహారాన్ని ట్రాక్ చేయవచ్చు.
– రైలు ఎంచుకున్న స్టేషన్‌కు చేరుకున్న తర్వాత Zoop మీ ఆహారాన్ని డెలివరీ చేస్తుంది.

Read Also : WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్ వస్తోంది.. ఇక చాట్‌లోనే స్టేటస్ చూసుకోవచ్చు..!