T20 world Cup Final : ఫైనల్ పోరుకు భారత్ రెడీ.. తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్.. విధ్వంసకర బ్యాటర్‌కు ఎంట్రీ.. గంభీర్ కీలక నిర్ణయం..
T20 world Cup Final IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) సాయంత్రం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి.
T20 world Cup Final IND vs NZ
- నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్
- న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్
- టీమిండియాలో కీలక మార్పులు.. విధ్వంసకర బ్యాటర్ ఎంట్రీ?
T20 world Cup Final IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) సాయంత్రం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని కివీస్ ఆరాటపడుతుండగా.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించాలని భారత్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మను తుది జట్టును తొలగించాలని కొందరు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ టోర్నీలో అభిషేక్ ఏడు మ్యాచ్‌లలో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, అభిషేక్ శర్మ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే తక్కువ ఓవర్లలోనే భారీ పరుగులుచేసి ప్రత్యర్థి జట్టు శిబిరంలో ఒత్తిడిని పెంచగలడని, అలాంటి విధ్వంసకర బ్యాటర్ తుది జట్టులో ఉండాలని మరికొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ తుది జట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పిస్తే.. ఆ స్థానంలో రింకూసింగ్ తుది జట్టులో చేరే చాన్స్ ఉంది. అయితే, ప్రస్తుతం రింకూ సింగ్ కూడా సరైన ఫామ్‌లో లేకపోవటంతో వీరిద్దరిలో తుది జట్టులో ఎవరు ఉంటారనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు.. బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. వరణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వరుణ్ ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. తద్వారా చెత్తరికార్డును నమోదు చేశాడు.
అయితే, అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కకు తప్పించి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కుల్దీప్ కంటే వాషింగ్టన్ సుందర్ స్పిన్ తోపాటు బ్యాటింగ్ లోనూ పరుగులు రాబట్టే సత్తా కలిగిన ఆల్ రౌండర్ కావడంతో అతన్ని తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే, ఇతర ఇటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ చక్రవర్తి వెనుకాల నిలబడ్డాడు. మరో ఆశ్చకరమైన పరిణామం ఏమిటంటే.. నెట్స్ లో ప్రారంభ ప్రాక్టీస్ కోసం వచ్చిన మొదటి ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్ ఒకరు. దీన్నిబట్టి చూస్తే.. ఫైనల్ మ్యాచ్ కోసం వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ తుది జట్టులో చేరుతాడని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
