LPG Price Hike : వార్ ఎఫెక్ట్.. గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
LPG Price Hike : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం భారతదేశంలోని సామాన్య ప్రజలపైనా పడుతుంది. గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
LPG Price Hike
- వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్
- ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు
- గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60
- కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంపు
LPG Price Hike : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం భారతదేశంలోని సామాన్య ప్రజలపైనా పడుతుంది. యుద్ధం కారణంగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలపైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడుతుంది. తాజాగా.. వంట గ్యాస్ ధరలుసైతం భారీగా పెరిగాయి.
Also Read : Gaddam Prasad Kumar: సడెన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
పశ్చిమాసియ యుద్ధం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపైనా పడింది. అందరూ ఊహించిన విధంగానే వంట గ్యాస్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ సిలిండర్ పై రూ. 115 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
ప్రతీనెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను చమురు సంస్థలు మార్పులు చేస్తాయి. అయితే, గత ఏడాది ఏప్రిల్ నుంచి గృహాల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. తాజాగా.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా 14.2కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దీంతో నిన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో రూ.853కే సిలిండర్ లభించగా.. ప్రస్తుతం రూ.913కి పెరిగింది.
నగరాల వారిగా పెరిగిన ధరల వివరాలు ఇలా..
♦ దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. అలాగే కమర్షియల్ 19కేజీల సిలిండర్ ధర రూ.1,768.50 నుంచి రూ.1,883కి పెరిగింది.
♦ కోల్‌కతాలో డొమెస్టిక్ సలిండర్ ధర రూ.912.50కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,835కు పెరిగింది.
♦ చెన్నైలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.928.50కి పెరగ్గా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,043.50కి పెరిగింది.
♦ ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.912.50కి చేరగా.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,835కు పెరిగింది.
♦ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. కమర్షియల్ సిలిందర్ ధర రూ. 2,076కి పెరిగింది.
భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయా..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచాయి. తాజా నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపై భారం పడనుంది. అంతేకాక.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ వ్యాపారాలు పెద్ద మొత్తంలో కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తాయి. దీంతో భవిష్యత్తులో హోటల్ లో లభించిన ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే దేశీయంగా కూడా ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
