ఫుడ్ డెలివరీ యాప్స్ సరికొత్త రికార్డు.. నిమిషాల్లో వేల ఆర్డర్లు..!

కరోనా వైరస్ ప్రభావంతో ఈ యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి.

ఇండియాలో పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్.. స్విగ్గీ, జొమాటో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి.

2021లో మాదిరిగానే 2022 కొత్త ఏడాదిలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాయి.

గత ఏడాదిలో క్రియేట్ చేసిన సొంత రికార్డులను స్విగ్గీ, జొమాటో బ్రేక్ చేశాయి.

జొమాటో.. నిమిషానికి 7,100  ఆర్డర్లు అందుకుంది.

స్విగ్గీ యాప్ కూడా నిమిషంలో 9వేల  ఆర్డర్లను అందుకుంది. 

డిసెంబర్ 31, 2021, రాత్రి 8.20 గంటలకు నిమిషంలో రికార్డు స్థాయిలో ఆర్డర్లు 

ఈ రెండు యాప్స్.. రోజులో 1.5 మిలియన్ల ఆర్డర్లను క్రాస్ చేశాయి.

గత 2021లో జొమాటో  నిమిషానికి 4వేల ఆర్డర్లు.. స్విగ్గీ  5వేల ఆర్డర్లను దాటేసింది.