New Year’s Eve 2022 : సరికొత్త రికార్డు.. నిమిషానికి స్విగ్గీ 9వేల ఆర్డర్లు.. జొమాటో 7వేల ఆర్డర్లు..

అసలే కరోనా కాలం.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. అంతా ఆన్‌లైన్‌లోనే.. ఫుడ్ కూడా అందులోనే ఆర్డర్ చేసేస్తున్నారు. కరోనా పుణ్యామాని ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఫుల్ గిరాకీ పెరిగిపోయింది.

New Year’s Eve 2022 : సరికొత్త రికార్డు.. నిమిషానికి స్విగ్గీ 9వేల ఆర్డర్లు.. జొమాటో 7వేల ఆర్డర్లు..

Swiggy Clocks Over 9,000 Orders Per Minute, Zomato Crosses 7,000 Orders Per Minute On New Year's Eve

Swiggy-Zomato Orders : అసలే కరోనా కాలం.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. అంతా ఆన్‌లైన్‌లోనే.. ఫుడ్ కూడా అందులోనే ఆర్డర్ చేసేస్తున్నారు. కరోనా పుణ్యామాని ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఫుల్ గిరాకీ పెరిగిపోయింది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఎప్పటిలా అందరూ బయట రెస్టారెంట్లకు వెళ్లే పరిస్థితి లేదు. ఒమిక్రాన్ భయంతో ఆన్‌లైన్‌లోనే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్ వేడుకులను జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగించుకుంటున్నాయి. అందులో ఇండియాలో బాగా పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్.. రెండే రెండు.. అవే.. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato).. ఈ రెండింటికి నగరాల్లో ఫుడ్ ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి.

రెస్టారెంట్లకు వెళ్లకుండా.. ఇంటి నుంచే ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేస్తున్నారు. హోం డెలివరీ సదుపాయం ఉండడంతో కోట్లాది మంది ఈ రెండు యాప్స్ వినియోగిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. 2022 న్యూ ఇయర్ సందర్భంగా పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. 2021లో మాదిరిగానే 2022 కొత్త ఏడాదిలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాయి. గత ఏడాదిలో ఈ రెండు క్రియేట్ చేసిన సొంత రికార్డులను బ్రేక్ చేశాయి. నిమిషానికి Swiggy ఆర్డర్‌లు.. ఇన్‌స్టంట్ గ్రోసరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్‌ను మినహాయించాయి.


జొమాటో.. నిమిషానికి 7,100 ఆర్డర్లు పూర్తి చేస్తే.. స్విగ్గీ నిమిషంలో 9వేల ఆర్డర్లను క్రాస్ చేసింది. డిసెంబర్ 31, 2021, రాత్రి 8.20 గంటల సమయానికి నిమిషంలో ఈ రెండు యాప్స్ ఒక్కొక్కటిగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను దాటేశాయి. ఈ రెండు యాప్స్.. రోజులో 1.5 మిలియన్ల ఆర్డర్లను క్రాస్ చేశాయి. గతంలో 2021 కొత్త ఏడాది సందర్భంగా జొమాటో నిమిషానికి 4వేల ఆర్డర్లను క్రాస్ చేయగా.. స్విగ్గీ అదే సమయంలో 5వేల ఆర్డర్లను దాటేసింది. ఆన్‌లైన్ ఆర్డర్‌లు వేగంగా నిర్వహించేందుకు UPI ద్వారా డిజిటల్ పేమెంట్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వినియోగదారులు పేమెంట్స్ చేసే సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు CEO దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. UPI సక్సెస్ రేటు అన్ని యాప్‌లలో 70శాతం నుంచి 40శాతానికి బాగా తగ్గిందని తెలిపారు.


జనవరి 1 నుంచి ఆర్డర్లపై అదనంగా చెల్లించాల్సిందే :
ఇదిలా ఉండగా.. స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్‌లో ఆర్డర్ చేస్తే.. కొత్త ఏడాది 2022 జనవరి 1వ తేదీ నుంచి అదనంగా ఎక్కువ ఖర్చు కానుంది. స్విగ్గీ, జొమాటో యాప్స్ అన్నీ రెస్టారెంట్ల తరఫున 2022 జనవరి 1 నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GSTను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్లపై 5శాతం పన్నును ఇప్పటివరకూ ప్రభుత్వానికి రెస్టారెంట్లు చెల్లించిస్తూ ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. ఇకపై ఫుడ్ డెలివరీ సంస్థలే ప్రభుత్వానికి నేరుగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం అదనంగా ఎలాంటి చార్జీలు విధించడం లేదు.

పన్ను చెల్లించాలంటే.. ప్రభుత్వానికి కట్టేందుకు ఈ యాప్స్ కస్టమర్ల నుంచి కొంత మొత్తంలో చార్జీల వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. ఫుడ్ ఆర్డరింగ్ సర్వీసులపై పన్ను విధానంలో మార్పులను జీఎస్టీ మండలి 45వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థలు నేరుగా ప్రభుత్వానికి జీఎస్టీ కట్టాలని భాగస్వామ్య రెస్టారెంట్ల తరఫున ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 2022 జనవరి 1 నుంచి ఈ ఫుడ్ ఆర్డర్లపై ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.


Read Also : Google Pixel 6 : పిక్సెల్ 6 ఫోన్లలో Update 2021‌తో కాల్ డ్రాప్ ఇష్యూ.. అప్‌డేట్ ఆపేసిన గూగుల్