Google Pixel 6 : పిక్సెల్ 6 ఫోన్లలో Update 2021‌తో కాల్ డ్రాప్ ఇష్యూ.. అప్‌డేట్ ఆపేసిన గూగుల్

గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్ 6 సిరీస్‌లో కాల్ డ్రా ఇష్యూ తలెత్తింది. Google Pixel 6 Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లలో ఇటీవల December 2021 Update రిలీజ్ చేసింది.

Google Pixel 6 : పిక్సెల్ 6 ఫోన్లలో Update 2021‌తో కాల్ డ్రాప్ ఇష్యూ.. అప్‌డేట్ ఆపేసిన గూగుల్

Google Pixel 6, Pixel 6 Pro December 2021 Update Paused Amid Call Drop Issues

Google Pixel 6 December 2021 Update : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్ 6 సిరీస్‌లో కాల్ డ్రా ఇష్యూ తలెత్తింది. Google Pixel 6 Pixel 6 Pro స్మార్ట్ ఫోన్లలో ఇటీవల December 2021 Update రిలీజ్ చేసింది. అయితే ఈ కొత్త అప్ డేట్ కారణంగా పిక్సెల్ ఫోన్లలో Call Drop Issues తలెత్తినట్టు రిపోర్టులు నివేదించాయి. కాల్ డ్రాప్‌ల నివేదికలతో Google Pixel 6 Pixel 6 Pro డిసెంబర్ 2021 అప్‌డేట్ నిలిపివేసినట్టు గూగుల్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 2021 అప్ డేట్ లో బగ్ ఇష్యూ ఉందని గుర్తించామని, వచ్చే జనవరి చివరి నాటికి రిలీజ్ అయ్యే మరో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఈ బగ్ ఫిక్స్ చేస్తామని పేర్కొంది. సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ విషయంలో వివిధ తేడాతో Google సరికొత్త ఫోన్‌లు తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అక్టోబర్‌లో ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌లు ప్రారంభించినప్పటి నుంచి సరికొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన పలువురు యూజర్లు సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు.

యూజర్ల ఫిర్యాదులపై స్పందించిన గూగుల్ పిక్సెల్.. తమ సపోర్టు పేజీలో Pixel 6, Pixel 6 Pro యూజర్ల కాల్ డ్రాప్స్ లేదా డిస్‌కనెక్ట్ సమస్యకు పరిష్కారాన్ని గుర్తించినట్లు Google వెల్లడించింది. జనవరి చివరి నాటికి ఈ పరిష్కారాన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. పిక్సెల్ యూజర్లు తమ ఫోన్లలో డిజిటల్ కార్ కీ సపోర్ట్, క్విక్ ట్యాప్ టు స్నాప్, నౌ ప్లేయింగ్ ఫీచర్, రికార్డర్‌ వంటి ఫీచర్లను పొందుతారు.

మీ పిక్సెల్ ఫోన్లలో అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ కనెక్టివిటీ సమస్యలకు సంబంధించి ఎలాంటి సమస్యను లేకుంటే అదే అప్ డేట్ కొనసాగించవచ్చు. Google Pixel 6, Pixel 6 Pro ఫోన్లలోని Android ఫ్లాష్ టూల్ ఉపయోగించి పాత వెర్షన్ పేజీ (flash.android.com)కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి మునుపటి సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను వెళ్లొచ్చు. అంతకంటే ముందు మీ ఫోన్‌ డేటాను బ్యాకప్ తీసుకోవడం మర్చిపోవద్దని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల, కొన్ని గూగుల్ Google Pixel 6, Pixel 6 Pro ఫోన్ల యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లలో కొన్ని క్రాక్స్ వంటి సమస్యలు ఉన్నట్టు రిపోర్టు చేశారు. vanilla Pixel 6 వేరియంట్‌తో పోలిస్తే.. ఎక్కువ సంఖ్యలో గూగుల్ Pixel 6 Pro స్మార్ట్‌ఫోన్‌ల యూజర్లే ప్రభావితమై ఉండవచ్చని నివేదిక తెలిపింది. గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌లలో two Assistant-enabled ఫీచర్లలో Hold For Me, Call Screen కూడా కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది.

Read Also : Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు