SAI Parenterals Limited ఐపీవో కోసం ఆర్‌హెచ్‌పీ దాఖలు
SAI Parenteral’s Limited ఒక విభిన్న ఔషధ తయారీ సంస్థ. ఇది పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Representative Image (Image Credit To Original Source)
SAI Parenterals Limited: ఔషధ తయారీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న SAI Parenterals Limited (SPL) సంస్థ తన ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం 2026 మార్చి 16న రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్ హెచ్ పీ) ను హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ ఈ), బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బీఎస్ ఈ) వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవోలో రూ.2,850 మిలియన్ వరకు కొత్త షేర్ల ఇష్యూ 31,57,880 ఈక్విటీ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. కంపెనీ తన షేర్లను ఎన్ ఎస్ఈ, బీఎస్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేయాలని భావిస్తోంది.
ఇష్యూ వివరాలు
• ఆఫర్ పీరియడ్: మంగళవారం, మార్చి 24, 2026- శుక్రవారం, మార్చి 27, 2026
• ఫ్రెష్ ఇష్యూ: రూ.2,850 మిలియన్
• ఆఫర్ ఫర్ సేల్: 31,57,880 షేర్లు
• ఫేస్ వాల్యూ: రూ.5
• BRLM: అరిహంత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్
• రిజిస్ట్రార్: బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
• QIB షేర్లు: గరిష్టంగా 50%
• రిటైల్ షేర్లు: కనిష్టంగా 35%
• NIB షేర్లు: కనిష్టంగా 15%
• ధర బ్యాండ్: ₹372–₹392
గమనిక: ఆఫర్ ఫర్ సేల్ లో ప్రమోటర్లు లేదా ప్రమోటర్ గ్రూప్ సభ్యులు పాల్గొనడం లేదు.
“మా ప్రయాణం ఒక స్పష్టమైన దృష్టితో కొనసాగుతోంది. ఇన్నోవేషన్ ఆధారిత, ఐపీ-లీడ్ ఫార్మాస్యూటికల్ సంస్థగా ఎదగడం. ఈ ఐపీవో మా సంస్థ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి. ఇది మా వ్యూహాత్మక లక్ష్యాలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను గ్లోబల్ ఫార్ములేషన్ వ్యాపార విస్తరణకు, అలాగే CDMO (కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) సామర్థ్యాలను పెంచడానికి వినియోగించుకుంటాము. మా అంతర్జాతీయ విస్తరణలో భాగంగా, ఆస్ట్రేలియాలోని నౌమ్డ్ ఫార్మాక్యూటికల్స్ ను కొనుగోలు చేయడం ద్వారా కొత్త మార్కెట్లలో ప్రవేశించగలుగుతున్నాము. ఇది మా గ్లోబల్ ప్రజెన్స్‌ను బలోపేతం చేస్తుంది” అని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కేకే తెలిపారు.
సాయి పేరెంటరల్స్ గురించి
సాయి పేరెంటరల్స్ ఒక ఔషధ తయారీ సంస్థ. ఇది పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
కంపెనీ రెండు ప్రధాన విభాగాల్లో పని చేస్తుంది.
* బ్రాండెండ్ జనరిల్ ఫార్ములేషన్స్
* సీడీఎంవో సేవలు
ఇది స్టెరైల్ ఇంజెక్టబుల్స్, ఓరల్ సాలిడ్స్, లిక్విడ్స్, టాపికల్ ఫార్ములేషన్స్ వంటి విభిన్న ఉత్పత్తులను అందిస్తుంది. భారత దేశంలో 5 తయారీ యూనిట్లు ఉండగా జీఎంపీ, డబ్లూహెచ్ వో -జీఎంపీ, టీజీఏ (ఆస్ట్రేలియా), PIC/S వంటి అంతర్జాతీయ ప్రమాణాలు పొందాయి. అదనంగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ తో కొత్త తయారీ యూనిట్ అభివృద్ధి జరుగుతోంది.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్
రూపేష్ (+91 76710 53361)
