Music Directors : మొన్నటిదాకా హీరోయిన్స్ మారేవాళ్ళు.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్.. పవన్, ఎన్టీఆర్ సినిమాలకు..
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. (Music Directors)
Music Directors
Music Directors : సినిమా నుంచి హీరోయిన్ ఔట్, కొత్త యాక్ట్రస్ ఇన్, హీరోయిన్ మారింది అనేది కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లు మారుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ముందుకు మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తీసుకున్నారు.
ఇప్పటికే DSP చేసిన పాటలు హిట్ అవుతున్నా, టైమ్‌లైన్ ఇష్యూస్ కారణంగా BGMకు తమన్‌ను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోసారి ఇలాంటి మ్యూజికల్ ఛైర్ ఆట టాలీవుడ్లో చూడబోతున్నామన్న టాక్ వినిపిస్తోంది.
Also Read : Harish Shankar : ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడో తెలుసా?
ఓ పెద్ద సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడ్ని మార్చే ఆలోచన ఉందట. ఆల్రెడీ ఆయన ట్యూన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు రీ-రికార్డింగ్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకొంటారని, అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌ను తీసుకుంటున్నారన్న ప్రచారం అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సర్ప్రైజ్ మ్యూజిక్ షిఫ్ట్స్ టాలీవుడ్లో కొత్త ట్రెండ్ అవుతున్నాయా.? రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు చూడాల్సి వస్తుందోనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Sridevi : వివాదంలో శ్రీదేవి ఆస్తి.. కోర్టుకెళ్లిన బోనీకపూర్, జాన్వీ కపూర్..
