Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, మీకు శుభవార్త. గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 540 తగ్గగా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.500 తగ్గింది. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.88,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.96,060 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.96,210కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 88,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.96,060కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.97,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా గోల్డ్ రేటు తగ్గింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) 8డాలర్లు తగ్గి 3,236డాలర్ల వద్ద ట్రేడవుతోంది..