Site icon 10TV Telugu

యూజీసీ నెట్ ఆన్సర్ కీ విడుదల

UGC NET Answer Key Released; Challenging Answer Key to Pay Rs 1000

జనవరి 1 వరకు అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’తమ అభ్యంతరాలను వెల్లడించేందుకు సమయం ఇచ్చింది. కీ లోని అభ్యంతరాలను నివృతి చేసుకోనే క్రమంలో అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

యూజీసీ నెట్ ఆన్సర్ కీ ని ఎన్టీఏ బోర్డు సోమవారం విడుదల చేసింది. నెట్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. జనవరి 1 వరకు అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’తమ అభ్యంతరాలను వెల్లడించేందుకు సమయం ఇచ్చింది. కీ లోని అభ్యంతరాలను నివృతి చేసుకోనే క్రమంలో అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాలు నిరూపితమైతే చెల్లించిన మొత్తాన్ని తిరిగి అభ్యర్థికి చెల్లించడం జరుగుతుందని ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ నెల మూడో వారంలో మొత్తం 85 సబ్జెక్టులపై ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించగా 9 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి యూజీసీ నెట్ పరీక్షను 295 నగరాల్లో మొత్తం 598 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం  ntanet.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్సర్ కీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Exit mobile version