DRDO CEPTAM Recruitment : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1061 స్టినోగ్రాఫర్ గ్రేడ్-I, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టులకు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులు 33, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I పోస్టులు 215, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులు 123, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు 250, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) పోస్టులు 12, స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ టైపింగ్) పోస్టులు 134, స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్) పోస్టులు 4, సెక్యూరిటీ అసిస్టెంట్ ‘A’ పోస్టులు 41, వెహికల్ ఆపరేటర్ పోస్టులు 145, ఫైర్ ఇంజన్ డ్రైవర్ పోస్టులు 18, ఫైర్ మ్యాన్ పోస్టులు 86 ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్,హిందీ టైపింగ్ స్కిల్స్ అవసరం. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.drdo.gov.in/ పరిశీలించగలరు.